Skip to main content

National Swimming Championship: సౌత్‌జోన్‌ జాతీయ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో రిత్విక, ఆదిత్యలకు స్వర్ణాలు

సౌత్‌జోన్‌ జాతీయ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు మూడు స్వర్ణ పతకాలు, ఒక రజతం, ఒక కాంస్య పతకం లభించాయి.

తిరువనంతపురంలో జరుగుతున్న ఈ టోర్నీలో గ్రూప్‌–1 బాలికల 50 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌ ఈవెంట్‌లో మిట్టపల్లి రిత్విక 35.91 సెకన్లలో గమ్యానికి చేరి పసిడి పతకం సాధించింది.   గ్రూప్‌–3 బాలికల 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో అనిక బంగారు పతకం గెలిచింది. బాలికల 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో తెలంగాణకు చెందిన మేఘన నాయర్‌ కాంస్య పతకాన్ని సాధించింది. ఈ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన‌ కె.లాస్యశ్రీ 1:08.29 సెకన్లలో గమ్యానికి చేరి బంగారు పతకాన్ని సొంతం చేసుకుంది. గ్రూప్‌–3 బాలుర 50 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో తెలంగాణ కుర్రాడు ఆదిత్య స్వర్ణం సంపాదించగా.. 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లీలో వర్షిత్‌ రజతం గెలిచాడు. 

Chess Championship: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ రాజా రిత్విక్‌కు బిడ్జ్ టైటిల్‌

Published date : 30 Dec 2022 03:09PM

Photo Stories