Chess Championship: తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ రాజా రిత్విక్‌కు బిడ్జ్ టైటిల్
Sakshi Education
స్పెయిన్‌లో జరిగిన సన్‌వే సిట్‌గెస్ ఓపెన్ అంతర్జాతీయ బ్లిట్జ్ చెస్ చాంపియన్‌షిప్‌లో 18 ఏళ్ల రాజా రిత్విక్ చాంపియన్‌గా అవతరించాడు.
నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత రాజా రిత్విక్ 8.5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 30 దేశాల నుంచి 120 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నీలో రిత్విక్ అజేయంగా నిలిచాడు. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థి అయిన రిత్విక్ ఈ టోర్నీలో ఎనిమిది గేముల్లో గెలిచి, మరో గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు. ప్రముఖ కోచ్ ఎన్.రామరాజుకు చెందిన రేస్ చెస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న రిత్విక్.. ఈ టోర్నీలో ముగ్గురు గ్రాండ్‌మాస్టర్లు ఆధిబన్, అరవింద్ చిదంబరం (భారత్), స్వెన్ ఫ్రెడరిక్ (జర్మనీ)పై గెలిచి మరో గ్రాండ్‌మాస్టర్ అర్జున్ కల్యాణ్ (భారత్)తో గేమ్‌ను ‘డ్రా’గా ముగించాడు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (క్రీడలు) క్విజ్ (11-17 నవంబర్ 2022)
Published date : 20 Dec 2022 03:38PM