Commonwealth Games 2022:‘కామన్వెల్త్’ జట్టులో రజని
Sakshi Education
![Rajini in the Commonwealth Games 2022](/sites/default/files/images/2022/06/24/rajani-1656073398.jpg)
ప్రపంచకప్‌లో పాల్గొనే అవకాశం దక్కకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ఇతిమరుపు రజనికి ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో ఆడే ఛాన్స్ లభించింది. హాకీ ఇండియా (హెచ్‌ఐ) జూన్ 23న ప్రకటించిన భారత మహిళల హాకీ జట్టులో గోల్‌కీపర్ రజనిని ఎంపిక చేశారు. అమ్మాయిల ప్రపంచకప్ హాకీ ముగిసిన 11 రోజుల వ్యవధిలోనే బర్మింగ్ హామ్ ఆతిథ్యమిచ్చే కామన్వెల్త్ గేమ్స్ మొదలవుతాయి. అయితే ఈ జట్టు కోసం పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఫిట్‌నెస్ లేని స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ ఈ టోరీ్నకి కూడా దూరమవగా, మూడు మార్పులతో కామన్వెల్త్ జట్టును ఎంపిక చేశారు.
Also read: IPS Dinkar Gupta: ఎన్‌ఐఏ చీఫ్‌గా దినకర్ గుప్తా
Published date : 24 Jun 2022 05:53PM