హైదరాబాద్ లో National volleyball పోటీలు
స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. బీహెచ్‌ఈఎల్ జ్యోతి విద్యాలయ పూర్వ విద్యార్థులు, వాలీబాల్ క్రీడాకారులు ఈ పోటీలకు శ్రీకారం చుట్టారు. పదేళ్లుగా అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు కృష్ణంరాజు ఏటా ప్రభుత్వ పాఠశాలల్లో వాలీబాల్ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. గ్రామస్థాయిలో ప్రారంభమైన ఈ పోటీలు నేడు జాతీయస్థాయికి చేరుకున్నాయి.
Also read: GST Council Meet : రాష్ట్రానికో జీ20 టీమ్
ఈ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడా పోటీల్లో సుమారు 80 టీంలు, సుమారు 800 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.
Also read: Weekly Current Affairs (Important Dates) Bitbank: జాతీయ గణాంక దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP