Skip to main content

Chinese Grand Prix: చైనా గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌దే విజయం

ఈ ఏడాది ఫార్ములావన్‌ సీజన్‌లో రెడ్‌బుల్‌ జట్టు డ్రైవర్‌ వెర్‌స్టాపెన్‌ తన జోరు కొనసాగిస్తూ నాలుగో విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
Max Verstappen Wins Chinese Grand Prix To Extend Title Grip

షాంఘైలో ఏప్రిల్ 21వ తేదీ జరిగిన సీజన్‌ ఐదో రేసు చైనా గ్రాండ్‌ప్రిలో వెర్‌స్టాపెన్‌ విజేతగా నిలిచాడు.
 
ఫార్ములా వన్ స్టార్ రేసర్, డిఫెండింగ్ ఛాంపియన్ మ్యాక్స్ వెర్‌స్టాపెన్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తూ, ఈ సీజన్‌లోనూ వరుస విజయాలను నమోదు చేస్తున్నాడు. ఈ సీజన్‌లో జరిగిన ఐదు రేసుల్లో ఇది వెర్‌స్టాపెన్‌కు నాలుగో విజయం. గత 27 రేసుల్లో 23వది.

2019 తర్వాత తొలిసారి చైనాలో జరిగిన ఈ రేసులో వెర్‌స్టాపెన్ ఆధిపత్యం ప్రదర్శించాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన వెర్‌స్టాపెన్‌ నిర్ణీత 56 ల్యాప్‌లను ఒక గంటా 40 నిమిషాల 52.554 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ల్యాండో నోరిస్ (మెక్‌లారెన్), సెర్జియో పెరెజ్ (రెడ్‌బుల్), చార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), కార్లోస్ సెయింజ్ జూనియర్ (ఫెరారీ) వరుసగా ఆ తర్వాతి స్థానాలను సొంతం చేసుకున్నారు. దిగ్గజ రేసర్ లూయిస్ హామిల్టన్ (మెర్సీడెజ్) 9వ స్థానంతో సంతృప్తి చెందాడు. స్థానిక రేసర్ జో గుయాన్య 14వ స్థానాన్ని దక్కించుకున్నాడు.

Gukesh: చరిత్ర సృష్టించిన గుకేశ్‌.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..

Published date : 22 Apr 2024 06:09PM

Photo Stories