WTT Contender: మనిక ఖాతాలో రెండు కాంస్యాలు
Sakshi Education
వరల్డ్ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) దోహా కంటెండర్ టోర్నమెంట్‌లో భారత స్టార్ ప్లేయర్ మనిక బత్రా రెండు కాంస్య పతకాలు సాధించింది.
మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సత్యన్ జ్ఞానశేఖరన్‌తో కలిసి కాంస్యం నెగ్గిన ఈ ఢిల్లీ అమ్మాయి మహిళల సింగిల్స్‌లోనూ కాంస్య పతకం కైవసం చేసుకుంది. దోహాలో జనవరి 20న జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ సెమీఫైనల్లో సత్యన్–మనిక ద్వయం 6–11, 11–9, 7–11, 8–11తో షిన్ యుబిన్–లిమ్ జాంగ్‌హూన్ (దక్షిణ కొరియా) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో మనిక 6–11, 11–2, 4–11, 2–11తో జాంగ్ రుయ్ (చైనా) చేతిలో ఓడింది.
Sania Mirza Retirement: టెన్నిస్‌కు సానియా మీర్జా గుడ్‌బై
Published date : 21 Jan 2023 04:00PM