Vijay Hazare Trophy 2022 : వరుసగా ఐదు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్
Sakshi Education
దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ-2022లో తమిళనాడు సంచలన విజయం సాధించింది. అరుణాచల్ ప్రదేశ్‌తో నవంబర్ 21న తలపడ్డ తమిళనాడు జట్టు ఏకంగా 435 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా లిస్ట్ ‘ఏ’ క్రికెట్(పరిమిత ఓవర్లు)లో అత్యంత భారీ తేడాతో గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది.
ఈ మ్యాచ్‌లో సాయి 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో 154 పరుగులు సాధించగా.. వికెట్ కీపర్, బ్యాటర్ జగదీశన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో డబుల్ సెంచరీ చేశాడు. 277 పరుగులతో రాణించి జట్టు 506 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో వరుసగా ఐదు సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా జగదీశన్ నిలిచాడు. వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వదిలించుకున్న ఎనిమిది క్రికెటర్లలో నారాయణ్ జగదీశన్ ఒకడు.
BCCI : బీసీసీఐ సెలక్షన్ కమిటీ రద్దు.. నూతన సెలక్టర్ల కమిటీ కోసం..
Published date : 22 Nov 2022 04:08PM