Skip to main content

IPL released players : స‌న్‌రైజ‌ర్స్ నుంచి విలియ‌మ్స‌న్ ఔట్

వచ్చే ఐపీఎల్‌ సీజన్‌ కోసం నిర్వహించే వేలం కోసం ప్రస్తుత జట్ల నుంచి తాము విడుదల చేసే ఆటగాళ్ల జాబితాను సమరి్పంచాలని ఆయా జట్లకు గవరి్నంగ్‌ కౌన్సిల్‌ నవంబర్‌ 15 (మంగళవారం) వరకు గడువు ఇచి్చంది. ఈ మేరకు 10 ఫ్రాంచైజీలు తమ జాబితాలను సమర్పించాయి. డిసెంబర్‌ 23న కొచ్చిలో జరిగే మినీ వేలంలో ఈ ఖాళీలను ఆయా జట్లు భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో జట్టులో గరిష్టంగా 25 మంది ఆటగాళ్లకు అవకాశం ఉండగా, వేలం మొత్తం రూ. 95 కోట్లు దాటరాదు.

ఎనిమిది సీజన్లుగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) జట్టులో భాగమైన కెపె్టన్‌ కేన్‌ విలియమ్సన్‌తో అనుబంధాన్ని ఫ్రాంచైజీ ముగించింది. ఐపీఎల్‌–2023 వేలానికి ముందు తమ జట్టు నుంచి విలియమ్సన్‌ను తప్పించాలని సన్‌రైజర్స్‌ యాజమాన్యం నిర్ణయించింది. విలియమ్సన్‌ 2015 నుంచి హైదరాబాద్‌ టీమ్‌తో ఉన్నాడు. 76 మ్యాచ్‌లలో 126.03 స్ట్రయిక్‌ రేట్‌తో 2101 పరుగులు చేసిన కేన్‌... 46 మ్యాచ్‌లలో కెపె్టన్‌గా వ్యవహరించాడు. వెస్టిండీస్‌ కెప్టెన్‌గా పేలవ ఫామ్‌లో ఉన్న నికోలస్‌ పూరన్‌ను కూడా సన్‌రైజర్స్‌ వదిలేసుకుంది. వీరిద్దరిని తప్పించడంతో రైజర్స్‌ ఖాతాలో వేలం కోసం ఏకంగా రూ. 24.75 కోట్లు చేరాయి.  చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్కే)తోనే ఉన్న ఆల్‌రౌండర్‌ డ్వేన్‌ బ్రేవోను కూడా ఆ జట్టు తప్పించగా.. పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు గత ఏడాది కెప్టెన్‌గా వ్యవహరించిన మయాంక్‌ను కూడా ఆ జట్టు వదిలేసింది. 

బ్యాటింగ్‌ కోచ్‌గా కిరణ్‌ పొలార్డ్‌..

ముంబై ఇండియన్స్‌ 5 ఐపీఎల్‌ టైటిల్స్, 2 చాంపియన్స్‌ లీగ్‌ టైటిల్స్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించిన పొలార్డ్‌  ఆటగాడిగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు. అయితే అతడు తమ జట్టుకు చేసిన సేవలను గుర్తిస్తూ పొలార్డ్‌ను బ్యాటింగ్‌ కోచ్‌గా ముంబై ఫ్రాంచైజీ ఎంపిక చేసింది.    

ఆయా జట్లు విడుదల చేసిన ఆటగాళ్ల పేర్లు..
కోల్‌కతా (16 మంది): కమిన్స్, బిల్లింగ్స్, నబీ, కరుణరత్నే, ఫించ్, హేల్స్, అమాన్, శివమ్‌ మావి, అభిజిత్, అజింక్య రహానే, అశోక్‌ శర్మ, బాబా     ఇంద్రజిత్, ప్రథమ్‌ సింగ్, రమేశ్‌ కుమార్, రసిఖ్‌ సలామ్, షెల్డన్‌ జాక్సన్‌.  


ముంబై (13 మంది): పొలార్డ్, స్యామ్స్, ఫాబియాన్‌ అలెన్, మెరిడిత్, మిల్స్, అన్‌మోల్‌ ప్రీత్, ఆర్యన్‌ జుయల్, బాసిల్‌ థంపి, జైదేవ్‌ ఉనాద్కట్, మయాంక్‌ మర్కండే, మురుగన్‌ అశి్వన్, రాహుల్‌ బుద్ధి (హైదరాబాద్‌), సంజయ్‌ యాదవ్‌.  


హైదరాబాద్‌ (12 మంది): విలియమ్సన్, పూరన్, షెఫర్డ్, అబాట్, సుచిత్, ప్రియం గార్గ్, సమర్థ్, సౌరభ్‌ దూబే, శశాంక్, శ్రేయస్‌ గోపాల్, సుశాంత్‌ మిశ్రా, విష్ణు వినోద్‌. 


రాజస్తాన్‌ (9 మంది): మిచెల్, నీషమ్, కౌల్టర్‌ నైల్, వాన్‌ డర్‌ డసెన్, బాష్, అనునయ్, కరుణ్‌ నాయర్, శుభమ్, తేజస్‌. 


పంజాబ్‌ (9 మంది): ఒడెన్‌ స్మిత్, హోవెల్, మయాంక్‌ అగర్వాల్, వైభవ్, ఇషాన్‌ పొరెల్, అన్‌‡్ష, ప్రేరక్, సందీప్‌ శర్మ, రితిక్‌.  


చెన్నై (8 మంది): డ్వేన్‌ బ్రేవో, మిల్నే, జోర్డాన్, ఉతప్ప, నిశాంత్, భగత్‌ వర్మ (హైదరాబాద్‌), ఆసిఫ్, జగదీశన్‌. 


లక్నో (7 మంది): హోల్డర్, టై, చమీర, లూయిస్, అంకిత్‌ రాజ్‌పుత్, మనీశ్‌ పాండే, షహబాజ్‌ నదీమ్‌.
గుజరాత్‌ (6 మంది): ఫెర్గూసన్, గుర్బాజ్, డ్రేక్స్, జేసన్‌ రాయ్, గుర్‌కీరత్, ఆరోన్‌. 


ఢిల్లీ (5 మంది): సీఫెర్ట్, శార్దుల్, కేఎస్‌ భరత్, అశ్విన్‌ హెబర్‌ (ఆంధ్ర), మన్‌దీప్‌. 


బెంగళూరు (5 మంది): బెహ్రన్‌డార్‌్ఫ, రూథర్‌ఫోర్డ్, అనీశ్వర్, లవ్‌నిత్, సీవీ మిలింద్‌ (హైదరాబాద్‌).

Published date : 16 Nov 2022 03:34PM

Photo Stories