Skip to main content

FIH Nations Cup: నేషన్స్‌ కప్‌ మహిళల హాకీ టోర్నీ విజేతగా భారత్‌

తొలిసారి నిర్వహించిన నేషన్స్‌ కప్‌ అంతర్జాతీయ మహిళల హాకీ టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది.

డిసెంబ‌ర్ 17న‌ వాలెన్షియా (స్పెయిన్‌)లో జరిగిన ఫైనల్లో సవితా పూనియా నాయకత్వంలోని టీమిండియా 1–0 గోల్‌ తేడాతో ఆతిథ్య స్పెయిన్‌ జట్టును ఓడించింది. ఆరో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను గుర్జీత్‌ కౌర్‌ గోల్‌గా మలిచింది. ఈ విజయంతో భారత్‌ 2023–2024 ప్రొ లీగ్‌కు నేరుగా అర్హత సాధించింది. టైటిల్‌ నెగ్గిన భారత జట్టు సభ్యులకు రూ.2 లక్షల చొప్పున హాకీ ఇండియా నగదు పురస్కారం ప్రకటించింది.   

ICC Ranking: ఐసీసీ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో స్మృతికి మూడో స్థానం

Published date : 19 Dec 2022 06:04PM

Photo Stories