Chess: మెనోర్కా ఓపెన్ టోర్నీలో టైటిల్ సాధించిన ఆటగాడు?
భారత చెస్ యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ స్పెయిన్‌లోని మెనోర్కా వేదికగా జరిగిన మెనోర్కా ఓపెన్ టోర్నెమెంట్–2022లో టైటిల్ సాధించాడు. నిర్ణీత ఏడు రౌండ్లపాటు జరిగిన మెనోర్కా ఓపెన్‌లో గుకేశ్ ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించగా... భారత్‌కే చెందిన నిహాల్ సరీన్ ఐదో ర్యాంక్‌లో, తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ ఎరిగైసి అర్జున్ ఆరో ర్యాంక్‌లో నిలిచారు. తమిళనాడుకు చెందిన 15 ఏళ్ల గుకేశ్ 2022, ఏప్రిల్ 17న లా రోడా ఓపెన్‌లోనూ విజేతగా నిలిచాడు.
GK International Quiz: నాటో సైనిక వ్యాయామం 'కోల్డ్ రెస్పాన్స్ 2022' ఎక్కడ జరిగింది?
ఏ దేశ వర్సిటీల్లో కో–ఎడ్యుకేషన్‌పై నిషేధం విధించారు?
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు మహిళలపై ఆంక్షలను మరింత పెంచుతున్నారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినీ విద్యార్థులు కలిసి చదువుకోవడంపై తాజాగా నిషేధం విధించారు. వర్సిటీల్లో కో–ఎడ్యుకేషన్‌కు ఇక అనుమతి లేదన్నారు. వారంలో వారంలో మొదటి మూడు రోజులు అమ్మాయిలకు, తర్వాతి మూడు రోజులు అబ్బాయిలకు పాఠాలు బోధించాలని ఆదేశించారు.
Archery: ప్రపంచకప్ టోర్నమెంట్‌లో స్వర్ణం గెలిచిన భారత జోడీ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మెనోర్కా ఓపెన్ టోర్నెమెంట్–2022లో టైటిల్ సాధించిన ఆటగాడు?
ఎప్పుడు : ఏప్రిల్ 24
ఎవరు : దొమ్మరాజు గుకేశ్
ఎక్కడ : మెనోర్కా, స్పెయిన్
ఎందుకు : నిర్ణీత ఏడు రౌండ్లపాటు జరిగిన మెనోర్కా ఓపెన్‌లో గుకేశ్ ఆరు పాయింట్లతో అగ్రస్థానాన్ని సంపాదించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్