Paris Olympics 2024: ఒలింపిక్స్‌లో భారత పురుషుల హాకీ జట్టుకు కాంస్య పతకం
సెమీస్‌లో అనూహ్యంగా ఓడినా.. చివరకు కాంస్య పతకం గెలుచుకొని భారత జట్టు తమ స్థాయిని ప్రదర్శించింది. ఈ ‘ప్లే ఆఫ్’ పోరులో భారత్ 2–1 గోల్స్ తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 2 గోల్స్ (30వ నిమిషం, 33వ నిమిషం) సాధించగా.. స్పెయిన్ తరఫున మార్క్ మిరాల్స్ (18వ నిమిషం) ఏకైక గోల్ కొట్టాడు. తాజా ఫలితంతో పారిస్ ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ ఖాతాలో నాలుగో కాంస్యం చేరింది.
➢ 1980 తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయిన భారత్ 41 ఏళ్ల తర్వాత టోక్యోలో కాంస్యం గెలిచింది.
➢ 1952–1972 మధ్య వరుసగా ఒలింపిక్ మెడల్ పోడియంపై నిలిచిన భారత జట్టు ఆ తర్వాత ఎప్పుడూ వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు గెలవలేకపోయింది. ఈసారి మాత్రం గత ఒలింపిక్స్ కాంస్యపు ప్రదర్శనను పునరావృతం చేసింది. దీంతో 52 ఏళ్ల తర్వాత వరుసగా రెండు ఒలింపిక్స్‌లలో పతకాలు సాధించింది.
➢ రెండు సందర్భాల్లోనూ జట్టు విజయాల్లో కీలకంగా నిలిచిన గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ ఈ గెలుపు తర్వాత ఘనంగా తన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
Paris Olympics: రజత పతకం సాధించిన నీరజ్ చోప్రా.. పాకిస్తాన్ ప్లేయర్‌కు స్వర్ణ పతకం!
ఒక్కొక్కరికీ 15 లక్షలు..
పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత పురుషుల హాకీ జట్టుకు హాకీ ఇండియా నజరానా ప్రకటించింది. జట్టులోని ఒక్కో ఆటగాడికి రూ.15 లక్షలు, సహాయక సిబ్బందికి ఏడున్నరల లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకం అందించనున్నట్లు హాకీ ఇండియా వెల్లడించింది. ఒలింపిక్స్ హాకీలో ఘనచరిత్ర ఉన్న భారత్‌కు విశ్వక్రీడల్లో ఇది 13వ పతకం.
నెదర్లాండ్స్‌కు స్వర్ణం పతకం..
24 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో నెదర్లాండ్స్ పురుషుల హాకీ జట్టు స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. ఫైనల్లో నెదర్లాండ్స్ ‘పెనాల్టీ షూటౌట్’లో 3–1తో జర్మనీ జట్టుపై గెలిచింది. నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. దాంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. గతంలో నెదర్లాండ్స్ జట్టు 1996 అట్లాంటా, 2000 సిడ్నీ ఒలింపిక్స్‌లలో పసిడి పతకాలు సాధించింది. భారత జట్టు అత్యధికంగా 8 స్వర్ణాలు నెగ్గగా.. నెదర్లాండ్స్, పాకిస్తాన్, బ్రిటన్, జర్మనీ జట్లు మూడు సార్లు చొప్పున బంగారు పతకాలు గెలిచాయి.