Skip to main content

International Cricket Council: టి20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్ర స్థానానికి చేరిన జట్టు?

ICC

ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో భారత జట్టు అగ్రస్థానానికి చేరుకుంది. ఫిబ్రవరి 20న వెస్టిండీస్‌తో సిరీస్‌ను 3–0తో గెలుచుకున్న అనంతరం భారత్‌ నంబర్‌వన్‌గా (269 రేటింగ్‌ పాయింట్స్‌) నిలిచింది. ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న ఇంగ్లండ్‌ను  రెండో స్థానానికి పడేసింది. ఇంగ్లండ్‌కు కూడా సమానంగా 269 రేటింగ్‌ పాయింట్లే ఉన్నా... 39 మ్యాచ్‌ల ద్వారా పాయింట్లపరంగా భారత్‌ (10,484), ఇంగ్లండ్‌కంటే (10,474) పది పాయింట్లు ఎక్కువగా ఉండటంతో అగ్రస్థానం దక్కింది. ఈ జాబితాలో పాకిస్తాన్‌ (266) మూడో స్థానంలో నిలిచింది. గతంలో భారత్‌ 2016లో చివరిసారిగా నంబర్‌వన్‌గా నిలిచింది.

చ‌ద‌వండి: ఐటీఎఫ్‌ డబుల్స్‌ విభాగంలో చాంపియన్‌గా నిలిచిన జోడీ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) టి20 టీమ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరిన జట్టు?
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు    : భారత జట్టు
ఎందుకు : ఫిబ్రవరి 20న వెస్టిండీస్‌తో సిరీస్‌ను 3–0తో గెలుచుకున్న అనంతరం భారత్‌కు 269 రేటింగ్‌ పాయింట్స్‌ లభించడంతో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 22 Feb 2022 01:40PM

Photo Stories