Skip to main content

ICC Men's World Cup 2023: కివీస్ భారీ విజ‌యం

వన్డే వరల్డ్‌ కప్‌ తొలి పోరు ఏకపక్షంగా ముగిసింది. 2019 ఫైనలిస్ట్‌ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ జట్టును ఓడించింది.
ICC Men's World Cup 2023 Live Updates
ICC Men's World Cup 2023 Live Updates

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్‌ (86 బంతుల్లో 77; 4 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌ కాగా, జోస్‌ బట్లర్‌ (42 బంతుల్లో 43; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. అనంతరం కివీస్‌ 36.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 283 పరుగులు చేసింది.

డెవాన్‌ కాన్వే (121 బంతుల్లో 152 నాటౌట్‌; 19 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రచిన్‌ రవీంద్ర (96 బంతుల్లో 123 నాటౌట్‌; 11 ఫోర్లు, 5 సిక్స్‌లు) సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరు రెండో వికెట్‌కు అభేద్యంగా 273 పరుగులు జోడించడం విశేషం. వన్డేల్లో రెండో వికెట్‌కు న్యూజిలాండ్‌ తరఫున ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. గప్టిల్‌ –విల్‌ యంగ్‌ పేరిట ఉన్న 203 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని కాన్వే–రచిన్‌ సవరించారు.  

స్కోరు వివరాలు

 ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: బెయిర్‌స్టో (సి) మిచెల్‌ (బి) సాన్‌ట్నర్‌ 33; మలాన్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 14; రూట్‌ (బి) ఫిలిప్స్‌ 77; బ్రూక్‌ (సి) కాన్వే (బి)  రవీంద్ర 25; మొయిన్‌ అలీ (బి) ఫిలిప్స్‌ 11; బట్లర్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 43; లివింగ్‌స్టోన్‌ (సి) హెన్రీ (బి) బౌల్ట్‌ 20; కరన్‌ (సి) లాథమ్‌ (బి) హెన్రీ 14; వోక్స్‌ (సి) యంగ్‌ (బి) సాన్‌ట్నర్‌ 11; ఆదిల్‌ రషీద్‌ (నాటౌట్‌) 15; వుడ్‌ (నాటౌట్‌) 13; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–40, 2–64, 3–94, 4–118, 5–188, 6–221, 7–229, 8–250, 9–252. 

బౌలింగ్‌: బౌల్ట్‌ 10–1–48–1, హెన్రీ 10–1–48–3, సాన్‌ట్నర్‌ 10–0–37–2, నీషమ్‌ 7–0–56–0,  రవీంద్ర 10–0–76–1, ఫిలిప్స్‌ 3–0–17–2. 

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌: కాన్వే (నాటౌట్‌) 152; యంగ్‌ (సి) బట్లర్‌ (బి) కరన్‌ 0; రచిన్‌ రవీంద్ర (నాటౌట్‌) 123; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (36.2 ఓవర్లలో వికెట్‌ నష్టానికి) 283. వికెట్ల పతనం: 1–10.

బౌలింగ్‌: వోక్స్‌ 6–0–45–0, స్యామ్‌ కరన్‌ 6–2–47–1, వుడ్‌ 5–0–55–0, అలీ 9.2–0–60–0, రషీద్‌ 7–0–47–0, లివింగ్‌స్టోన్‌ 3–0–24–0.  

Published date : 06 Oct 2023 01:02PM

Photo Stories