Skip to main content

ICC Tournaments : ఈ దేశాల్లోనే కీల‌క మ్యాచ్‌ల వేదిక‌లు

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ 2024 నుంచి 2031 మధ్య జరగనున్న ఐసీసీ మేజర్‌ ఈవెంట్లకు ఆతిథ్యమివ్వనున్న దేశాల జాబితాను న‌వంబ‌ర్ 16వ తేదీన‌ విడుదల చేసింది.
 ICC Tournaments From 2024 To 2031
ICC Tournaments From 2024 To 2031

ఇక 2024-2031 మధ్య కాలంలో నాలుగు టి20 వరల్డ్‌కప్‌లు..రెండు చాంపియన్స్‌ ట్రోపీలు, రెండు వన్డే వరల్డ్‌కప్‌లు జరగనున్నాయి. ఈ ఐసీసీ మేజర్‌ టోర్నీలకు ఎనిమిది దేశాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఇందులో ఒక టోర్నీకి అమెరికా- వెస్టిండీస్‌, మరొక టోర్నీకి పాకిస్తాన్‌, మూడు మేజర్‌ టోర్నీలకు భారత్‌ ఆతిథ్యమివ్వనుంది. 

మ్యాచ్‌ల వివ‌రాలు ఇలా..
☛ జూన్‌ 2024లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు అమెరికా-వెస్టిండీస్‌ ఆతిథ్యమివ్వనున్నాయి.
☛ 2025 ఫిబ్రవరిలో జరగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి పాకిస్తాన్‌ ఆతిథ్యమివ్వనుంది.
☛2026 ఫిబ్రవరిలో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు భారత్‌,శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.
☛2027 అక్టోబర్‌- నవంబర్‌ నెలలో జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వేలు ఆతిథ్యమివ్వనున్నాయి.
☛2028 అక్టోబర్‌ నెలలో జరగనున్న టి20 ప్రపంచకప్‌ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి.
☛2029 అక్టోబర్‌ నెలలో జరగనున్న ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి భారత్‌ ఆతిథ్యమివ్వనుంది.
☛2030 జూన్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్‌కు ఇంగ్లండ్‌, ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.
☛ 2031 అక్టోబర్‌-నవంబర్‌ నెలలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు ఇండియా, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.

Published date : 16 Nov 2021 07:13PM

Photo Stories