Skip to main content

Halep banned for Doping: హాలెప్‌పై నాలుగేళ్ల నిషేధం

డోపింగ్‌ నిబంధనలను అతిక్రమించినందుకు... రొమేనియా టెన్నిస్‌ స్టార్, ప్రపంచ మాజీ నంబర్‌వన్‌ సిమోనా హాలెప్‌పై ఇంటర్నేషనల్‌ టెన్నిస్‌ ఇంటెగ్రిటీ ఏజెన్సీ (ఐటీఐఏ) నాలుగేళ్లపాటు నిషేధం విధించింది.
Halep banned for Doping, Four-Year Ban by ITIA, Romanian Tennis Star
Halep banned for Doping

 31 ఏళ్ల హాలెప్‌ 2022 యూఎస్‌ ఓపెన్‌ సందర్భంగా డోపింగ్‌ పరీక్షలో విఫలమైంది. దాంతో ఆమెపై 2022 అక్టోబర్‌లో తాత్కాలిక నిషేధం విధించారు. ఐటీఐఏ ప్యానెల్‌ విచారణలో హాలెప్‌ ఉద్దేశపూర్వకంగానే డోపింగ్‌ నియమావళిని ఉల్లంఘించిందని తేలింది. దాంతో ఆమెపై నిషేధాన్ని అక్టోబర్‌ 2026 వరకు పొడిగించారు. 2017లో ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించిన హాలెప్‌ రెండు గ్రాండ్‌స్లామ్‌ (2018లో ఫ్రెంచ్‌ ఓపెన్, 2019లో వింబుల్డన్‌) సింగిల్స్‌ టైటిల్స్‌ సాధించింది. 

US Open Men's Singles 2023: యూఎస్‌ ఓపెన్ విజేత‌గా జొకోవిచ్‌

Published date : 14 Sep 2023 09:56AM

Photo Stories