Skip to main content

US Open Men's Singles 2023: యూఎస్‌ ఓపెన్ విజేత‌గా జొకోవిచ్‌

ఈ ఏడాది ఆడిన నాలుగు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీల్లోనూ ఫైనల్‌ చేరిన జొకోవిచ్‌ సీజన్‌లో చివరిదైన యూఎస్‌ ఓపెన్‌లో నాలుగోసారి చాంపియన్‌గా నిలిచాడు.
US Open Men's Singles 2023, Novak Djokovic ,24th Grand Slam
US Open Men's Singles 2023

భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం ఐదు గంటలకు ముగిసిన పురుషుల సింగిల్స్‌ విభాగం ఫైనల్లో రెండో సీడ్‌ జొకోవిచ్‌, మూడో సీడ్‌ డానిల్‌ మెద్వెదెవ్‌ (రష్యా)పై గెలిచాడు.

Indonesia Open Masters badminton 2023: ఇండోనేసియా ఓపెన్‌ మాస్టర్స్‌లో టైటిల్ విజేత‌గా కిరణ్‌ జార్జి

విజేత జొకోవిచ్‌కు 30 లక్షల డాలర్లు (రూ. 24 కోట్ల 90 లక్షలు), రన్నరప్‌ మెద్వెదెవ్‌కు 15 లక్షల డాలర్లు (రూ. 12 కోట్ల 45 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి. ఈ గెలుపుతో జొకోవిచ్‌ ఖాతాలో 24వ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ చేరింది. అత్యధికంగా 24 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ నెగ్గిన ప్లేయర్‌గా ఆస్ట్రేలియా క్రీడాకారిణి మార్గరెట్‌ కోర్ట్‌ (ఆస్ట్రేలియా) పేరిట ఉన్న రికార్డును జొకోవిచ్‌ సమం చేశాడు. అంతేకాకుండా ఏటీపీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు.

US Open Title Winner: యూఎస్‌ ఓపెన్‌ పురుషుల డబుల్స్‌లో టైటిల్ విజేత‌గా రాజీవ్‌ రామ్‌–జో సాలిస్‌బరీ జోడీ

ఒకే ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ టైటిల్స్‌ను నాలుగుసార్లు చొప్పున (2011, 2015, 2021, 2023) సాధించిన తొలి ప్లేయర్‌గా జొకోవిచ్‌ నిలిచాడు. జొకోవిచ్‌ కెరీర్‌లో గెలిచిన సింగిల్స్‌ టైటిల్స్‌ 96. అత్యధిక సింగిల్స్‌ టైటిల్స్‌ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో కానర్స్‌ (109; అమెరికా), ఫెడరర్‌ (103; స్విట్జర్లాండ్‌) తర్వాత జొకోవిచ్‌ మూడో స్థానంలో ఉన్నాడు.

Asian Table Tennis Championships 2023: టేబుల్ టెన్నిస్‌లో భారత జ‌ట్టుకు కాంస్యం

Published date : 13 Sep 2023 12:11PM

Photo Stories