Shotgun World Cup: స్కీట్‌లో గనీమత్ జాతీయ రికార్డు సమం
Sakshi Education
ప్రపంచకప్ షాట్‌గన్ షూటింగ్ టోర్నమెంట్‌లో మహిళల స్కీట్ ఈవెంట్‌లో భారత షూటర్ గనీమత్ సెఖోన్ జాతీయ రికార్డును సమం చేసింది.
దోహాలో జరుగుతున్న ఈ టోర్నీలో చండీగఢ్‌కు చెందిన 22 ఏళ్ల గనీమత్ క్వాలిఫయింగ్‌లో 125 పాయింట్లకుగాను 120 పాయింట్లు స్కోరు చేసింది. అయితే ఆమె ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయింది. షూట్ ఆఫ్‌లో గనీమత్ గురి తప్పి టాప్–8లో నిలువలేకపోయింది. భారత్‌కే చెందిన దర్శన రాథోడ్ 117 పాయింట్లతో 25వ స్థానంలో, మహేశ్వరి చౌహాన్ 116 పాయింట్లతో 28వ స్థానంలో నిలిచారు.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Sports) క్విజ్ (29 జనవరి - 04 ఫిబ్రవరి 2023)
Published date : 08 Mar 2023 05:27PM