T20: ‘లక్నో’ జట్టు గ్లోబల్ మెంటార్‌గా గంభీర్
Sakshi Education
భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ బాధ్యతలు పెరిగాయి. రాజీవ్ ప్రతాప్ సంజీవ్ గోయెంకా (ఆర్‌పీఎస్‌జీ) గ్రూప్‌నకు చెందిన టి20 క్రికెట్ జట్లకు అతను ఇకపై గ్లోబల్ మెంటార్‌గా వ్యవహరించనున్నాడు.
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను రెండుసార్లు చాంపియన్‌గా నిలిపిన ఈ మాజీ కెప్టెన్ ను తొలుత లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) మార్గనిర్దేశకుడు (మెంటార్)గా నియమించింది. అనంతరం దక్షిణాఫ్రికా టి20 లీగ్‌లోకి ప్రవేశించిన ఆర్‌పీఎస్‌జీ గ్రూప్ డర్బన్ ఫ్రాంచైజీని కొనుగోలు చేసింది. ఇప్పుడు గ్లోబల్ మెంటార్ బాధ్యతలు అప్పగించడంతో గంభీర్ డర్బన్ సూపర్ జెయింట్స్‌కు కూడా మార్గనిర్దేశకుడిగా ఉంటాడు. దీనిపై స్పందించిన గంభీర్ ‘నాపై నమ్మకంతో కట్టబెట్టిన అదనపు బాధ్యతల్ని సమర్థంగా నిర్వర్తించేందుకు కృషిచేస్తా. ఆటగాళ్లకు మార్గదర్శనం చేస్తూ జట్లకు విజయాలు అందించడంపైనే దృష్టిసారిస్తా’ అని అన్నాడు.
Published date : 08 Oct 2022 08:17PM