Skip to main content

Hockey:‘ఎఫ్‌ఐహెచ్‌ రైజింగ్‌ ప్లేయర్‌’గా ముంతాజ్‌ ఖాన్‌

భారత మహిళల హాకీ జట్టు ఫార్వర్డ్‌ ముంతాజ్‌ ఖాన్‌కు అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) అవార్డు లభించింది. లక్నోకు చెందిన 19 ఏళ్ల ముంతాజ్‌ ‘రైజింగ్‌ ప్లేయర్‌’గా ఎంపికైంది.
FIH Rising Player Mumtaz Khana
FIH Rising Player Mumtaz Khana

ఈ ఏడాది ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికాలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌లో ముంతాజ్‌ విశేషంగా రాణించి హ్యాట్రిక్‌తో సహా ఎనిమిది గోల్స్‌ సాధించింది. జూనియర్‌ ప్రపంచకప్‌లో భారత్‌ నాలుగో స్థానంలో నిలిచింది. కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ‘షూటౌట్‌’లో ఇంగ్లండ్‌ చేతిలో ఓడిపోయింది.  

Also read: North Korea Missile: జపాన్‌ మీదుగా ఉత్తరకొరియా క్షిపణి ప్రయోగం

Published date : 06 Oct 2022 06:33PM

Photo Stories