Skip to main content

PM meets world champion boxer Nikhat Zareen: ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌

ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన తెలంగాణ మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌కు రాష్ట్ర ప్రభుత్వం సముచిత గుర్తింపు ఇచ్చింది. రూ.2 కోట్ల నగదు బహుమతిని ప్రకటించడంతో పాటు బంజారాహిల్స్‌ లేదా జూబ్లీహిల్స్‌లో నివాసయోగ్య మైన ఇంటి స్థలం కేటాయించాలని నిర్ణయించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం జూన్‌  1 (బుధవారం) ఒక ప్రకటన విడుదల చేసింది.రాష్ట్ర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన తెలంగాణ బిడ్డలను సమున్నతంగా గౌరవించుకోవాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించినట్టు పేర్కొంది. ఇటీవల టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో 52 కేజీల విభాగంలో నిఖత్‌ విజేతగా నిలిచింది. 
Boxer Nikhat Zareen won a gold medal in the Women’s World Boxing Championships

ఇషా సింగ్‌కు కూడా..
అంతర్జాతీయ షూటర్‌ ఇషా సింగ్‌కు కూడా ఇదే తరహాలో  ప్రభుత్వం నజరానాను ప్రకటించింది. రూ.2 కోట్ల నగదుతో పాటు ఇంటి స్థలం ఇవ్వనుంది. ఇటీవల జర్మనీలో జరిగిన జూనియర్‌ ప్రపంచకప్‌ టోర్నీలో ఇషా టీమ్‌ ఈవెంట్లలో 3 స్వర్ణ పతకాలు గెల్చుకుంది. 

మొగిలయ్యకు రూ.కోటి నగదు బహుమతి

పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్న కిన్నెరమెట్ల మొగిలయ్యకు రూ.కోటి నగదు పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎం ఆదేశాలతోఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మొగి లయ్య కోరిక మేరకు బీఎన్‌రెడ్డి నగర్‌ కాలనీలో నివాస యోగ్యమైన ఇంటి స్థలాన్ని కేటాయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అంతరించిపో తున్న జానపద కిన్నెర వాయిద్య కళలో గొప్ప విద్వాంసుడిగా మొగిలయ్య కీర్తి గడించారు.   

ప్రధాని మోదీని కలిసిన నిఖత్‌

నిఖత్‌ జూన్‌  1 (బుధవారం) ప్రధాని నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాలు సాధించిన మనీషా మౌన్‌ (57 కేజీలు), పర్వీన్‌ హుడా (63 కేజీలు) కూడా ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా మోదీ వారిని అభినందించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ సార్‌ను కలుసుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. థ్యాంక్యూ సార్‌’ అంటూ ప్రధానితో దిగిన ఫొటోను నిఖత్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. 

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 1 కరెంట్‌ అఫైర్స్‌

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 Jun 2022 03:23PM

Photo Stories