Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 1 కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 1st 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations

ISSF World Cup: ప్రపంచకప్‌ రైఫిల్‌, పిస్టల్‌, షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన భారత్‌

ప్రపంచకప్‌ రైఫిల్‌, పిస్టల్‌, షాట్‌గన్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌ బంగారు బోనీ చేసింది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ మహిళల టీమ్‌ ఈవెంట్‌లో ఇలవేనిల్‌ వలరివన్‌, రమిత, శ్రేయా అగర్వాల్‌లతో కూడిన భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది.

International Shooting Sport Federation winner

World Economic Forum thanks CM Jagan : సీఎం జగన్‌కు వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం కృతజ్ఞతలు

 

అమరావతి: ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్‌ 2022 వార్షిక సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని చూపిన చొరవపై వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం మంగళవారం కృతజ్ఞతలు తెలిపింది. ‘చరిత్రలో మలువు, ప్రభుత్వ విధానాలు, వ్యాపార వ్యూహాలు’ అనే ఇతివృత్తంపై నిర్వ హించిన సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్న సంగతి తెలిసిందే.

దశాబ్దాలుగా అత్యంత సవాల్‌గా ఉన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యాల్లో సమావేశం జరిగిందని, ప్రపంచా నికి ఈ క్లిష్ట సమయాన దావోస్‌లో వ్యూహాత్మక సంభాషణల్లో మీ (సీఎం జగన్‌) సహకారం చాలా ముఖ్యమైనదని ఫోరం అధ్యక్షుడు బోర్జ్‌ బ్రెండే జగన్‌కు రాసిన లేఖలో పేర్కొ న్నారు. వార్షిక సమావేశంలో బలమైన స్వరంతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహిం చినందుకు సీఎం జగన్‌కు ఫోరం ధన్యవాదాలు తెలి పింది. దావోస్‌లో మీ (సీఎం జగన్‌) అను భవం ఫలవంతమైందని లేఖలో పేర్కొన్నారు. 

Telangana Formation Day Ceremonies: తొలిసారిగా కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

దేశ రాజధాని ఢిల్లీలో తొలిసారిగా జూన్‌ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర సాంçస్కృతిక మంత్రిత్వశాఖ నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

  • జూన్‌ 2 (గురువారం) సా యంత్రం ఆరున్నర గంటల నుంచి డాక్టర్‌ అంబేడ్కర్‌ ఇంటర్నేషనల్‌ సెంటర్‌లో జరిగే వేడుకల్లో గాయకులు మంగ్లీ, హేమచంద్ర సహా తెలంగాణకు చెందిన జానపద కళాకారులు రాష్ట్ర సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించనున్నారు.
  • ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌లో భాగంగా హరియాణా రాష్ట్ర పాఠశాల విద్యార్థులతో ప్రదర్శనలు ఏర్పాటు చేయనున్నారు. గతేడాది మార్చి 12న 75వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు 75 వారాల కౌంట్‌డౌన్‌తో ప్రారంభమైన ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకలు 2023 ఆగస్టు 15న ముగుస్తాయని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. 
  • Union Cabinet: జాతీయ జీవ ఇంధన విధానానికి సవరణలు

  • Download Current Affairs PDFs Here
Published date : 01 Jun 2022 05:23PM

Photo Stories