World Test Championship final: తొలిసారి టెస్టుల్లో ప్రపంచ చాంపియన్‌గా ఆసీస్.. డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ చిత్తు
చివరి రోజు హోరాహోరీగా సాగుతుందనుకున్న ఆట భారత్ పేలవ బ్యాటింగ్‌తో ఏకపక్షంగా ముగిసింది. 444 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 164/3తో ఆట కొనసాగించిన భారత్ 234 పరుగులకే ఆలౌటైంది. విరాట్ కోహ్లి (78 బంతుల్లో 49; 7 ఫోర్లు), అజింక్య రహానే (108 బంతుల్లో 46; 7 ఫోర్లు) తమ జోరును చివరి రోజు కొనసాగించలేకపోయారు. లయన్‌కు 4 వికెట్లు దక్కాయి. ట్రవిస్ హెడ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది.
Most Expensive City: దేశంలో నివాస వ్యయాల పరంగా ఖరీదైన పట్టణం ఇదే.. హైదరాబాద్ స్థానం ఏంతంటే..?
విజేత ఆస్ట్రేలియా జట్టుకు గదతోపాటు 16 లక్షల డాలర్లు (రూ. 13 కోట్ల 19 లక్షలు), రన్నరప్ భారత జట్టుకు 8 లక్షల డాలర్లు (రూ. 6 కోట్ల 59 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.
23.3 ఓవర్లు.. 70 పరుగులు.. 7 వికెట్లు.. చివరి రోజు భారత జట్టు ప్రదర్శన ఇది. జూన్ 10న ఆఖరి గంటలో ప్రదర్శించిన పట్టుదల గానీ, దూకుడు కానీ ఎక్కడా కనిపించలేదు. ఒకరి వెనుక ఒకరు వరుస కట్టడంతో లంచ్‌లోపే ఓటమి ఖాయమైంది. తొలి 6 ఓవర్ల పాటు కోహ్లి, రహానే గట్టిగా నిలబడ్డారు. అయితే బోలండ్ వేసిన తర్వాతి ఓవర్ ఆటను మలుపు తిప్పింది. స్లిప్‌లో స్మిత్ చక్కటి క్యాచ్‌కు కోహ్లి వెనుదిరగ్గా, మరో రెండు బంతులకే జడేజా (0) కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి చెత్త బౌలింగ్ వేసిన స్టార్క్ అసలు సమయంలో తన విలువను చూపించాడు. అతని బంతిని ఆడలేక రహానే కీపర్‌కు క్యాచ్ ఇవ్వడంతో భారత్ వేగంగా ఓటమి దిశగా పయనించింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆదుకున్న శార్దుల్ (0) ఈసారి నిలవలేకపోగా, ఉమేశ్ యాదవ్ (1) అతడిని అనుసరించాడు. కొద్దిసేపు పోరాడిన శ్రీకర్ భరత్ (41 బంతుల్లో 23; 2 ఫోర్లు)ను వెనక్కి పంపిన లయన్, తన తర్వాతి ఓవర్లో సిరాజ్ (1)ను అవుట్ చేసి భారత్ ఆట ముగించాడు.
Richest Cities: ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నగరాలు ఇవే.. భారత్‌కు దక్కని చోటు!
☛ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని టోర్నమెంట్‌లను గెలిచిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా జట్టు ఐదుసార్లు (1987, 1999, 2003, 2007, 2015) వన్డే వరల్డ్‌కప్‌ను.. రెండుసార్లు (2006, 2009) చాంపియన్స్ ట్రోఫీని... ఒకసారి (2021) టి20 వరల్డ్‌కప్‌ను. ఒకసారి (2023) ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను సాధించింది.