Richest Cities: ప్రపంచంలోని టాప్ 10 సంపన్న నగరాలు ఇవే.. భారత్‌కు దక్కని చోటు!
ఈ జాబితాలోని టాప్ 10లో భారతదేశానికి చెందిన ఒక్క నగరం కూడా లేదు. ప్రపంచంలోని అత్యంత సంపన్న నగరంగా న్యూయార్క్ నిలిచింది. ఈ నగరంలో 3.4 లక్షల మంది మిలియనీర్లు, 724 సెంటీ మిలియనీర్లు, 58 మంది బిలియనీర్లు ఉన్నారు. అమెరికాకు ఆర్థిక రాజధానిగా పేరుపొందిన న్యూయార్క్‌లో ప్రపంచంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్‌చేంజ్‌లు ఎన్‌వైఎస్‌ఇ, నాస్‌డాగ్ ఉన్నాయి. 100 మిలియన్ అమెరికా డాలర్ల (రూ.822 కోట్లు) కంటే ఎక్కువ సంపద ఉన్న వ్యక్తులను సెంటీ మిలియనీర్లుగా, ఒక బిలియన్ డాలర్ల (రూ.8,225 కోట్లు) కంటే ఎక్కువ సంపద ఉంటే బిలియనీర్లుగా పరిగణిస్తారు.
టాప్ 10 సంపన్న నగరాలివే..
సంపన్న నగరాల జాబితాలో మొదటి స్థానం న్యూయార్క్(అమెరికా)కు చోటు దక్కింది. రెండవ స్థానంలో టోక్యో(జపాన్), తృతీయ స్థానంలో ది బే ఏరియా(అమెరికా), నాల్గవ స్థానంలో లండన్(బ్రిటన్) ఉన్నాయి. తరువాత వరుసగా సింగపూర్, లాస్ ఏంజెలెస్(అమెరికా), హాంకాంగ్(చైనా అధీనంలోని ప్రత్యేక పాలనా ప్రాంతం), బీజింగ్(చైనా), షాంఘై(చైనా), సిడ్నీ(ఆస్ట్రేలియా) ఉన్నాయి.
India Population: భారతదేశ జనాభా 142.86 కోట్లు.. యువ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలివే..
హైదరాబాద్‌కు చోటు..
ఈ జాబితాలో హైదరాబాద్‌కు చోటు లబించింది. భాగ్యనగరంలో మొత్తం 11,100 మంది మిలియనీర్లు ఉన్నట్లు హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ సంస్థ ఓ అధ్యయనంలో వెల్లడించింది. పది లక్షల డాలర్లకు (ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ.8.2 కోట్లు) పైగా ఆస్తులు ఉన్న వ్యక్తులను మిలియనీర్లుగా పరిగణిస్తారు. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా 97 నగరాలు చోటు దక్కించుకోగా హైదరాబాద్‌కు 65వ స్థానం లభించింది. మన దేశం నుంచి 59,400 మంది మిలియనీర్లతో ముంబయి 21వ స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో 3.40 లక్షల మంది మిలియనీర్లతో న్యూయార్క్ నగరం మొదటి స్థానంలో ఉంది. ఈ మేరకు 2012-2022 మధ్య హైదరాబాద్‌లో అత్యధిక నికర సంపద ఉన్న వ్యక్తుల సంఖ్య 78 శాతం పెరిగిందని పేర్కొంది.
కాగా హైదరాబాద్‌లో 40 మంది సెంటీ మిలియనీర్లు, అయిదుగురు బిలియనీర్లు ఉన్నట్లు తెలిపింది. ఈ జాబితాలో దేశ ఆర్థిక రాజధాని ముంబై 59400 మంది మిలియనీర్లతో 21వ స్థానంలో, ఢిల్లీలో 30200 మంది మిలియనీర్లతో 36 స్థానంలో, బెంగుళూరు 12600 మందితో 60వ స్థానంలో, కోల్‌కతా నగరం 12100 మంది 63వ స్థానంలో నిలిచింది.