Asian Athletics Championship: ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం
ప్రతిష్టాత్మక ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో విశాఖపట్నం జిల్లాకు చెందిన 23 ఏళ్ల జ్యోతి మహిళల 100 మీటర్ల హర్డిల్స్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. July 13 జరిగిన 100 మీటర్ల హర్డిల్స్ ఫైనల్ రేసులో జ్యోతి అందరికంటే వేగంగా 13.09 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా అవతరించింది.
☛☛ Canada Open: కెనడా ఓపెన్ టైటిల్ విజేత లక్ష్య సేన్
అసుక తెరెదా (జపాన్; 13.13 సెకన్లు) రజత పతకం, ఆకి మసుమి (జపాన్; 13.26 సెకన్లు) కాంస్య పతకం గెలిచారు. వర్షం కారణంగా తడిగా ఉన్న ట్రాక్‌పై జరిగిన ఫైనల్ రేసులో జ్యోతి ఆద్యంతం ఒకే వేగంతో పరిగెత్తి అనుకున్న ఫలితం సాధించింది. 50 ఏళ్ల చరిత్రగల ఆసియా చాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా గుర్తింపు పొందింది.
12.82 సెకన్లతో జ్యోతి పేరిటే జాతీయ రికార్డు ఉంది. గత నెలలో జాతీయ అంతర్ రాష్ట్ర చాంపియన్‌షిప్‌లో జ్యోతి 12.92 సెకన్ల సమయం నమోదు చేసి స్వర్ణం గెలిచింది. అయితే ఆసియా చాంపియన్‌షిప్‌లో వర్షం కారణంగా ట్రాక్ తడిగా ఉండటంతో జ్యోతి 13 సెకన్లలోపు పూర్తి చేయలేకపోయింది.
☛☛ Daily Current Affairs in Telugu: 14 జులై 2023 కరెంట్ అఫైర్స్