Skip to main content

Divyansh Singh Panwar: ఎయిర్‌గన్‌ షూటింగ్‌లో దివ్యాంశ్‌కు స్వర్ణం

ఆసియా ఎయిర్‌గన్‌ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షూటర్‌ దివ్యాంశ్‌ సింగ్‌ పన్వర్‌ సత్తా చాటాడు.
Divyansh Singh Panwar

కొరియాలో జరిగిన టోర్నీలో 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ జూనియర్‌ విభాగంలో అతడు స్వర్ణం సాధించాడు. పసిడి పతక పోరులో దివ్యాంశ్‌17–9తో బాంగ్‌సెంగో(కొరియా) ను ఓడించాడు. ర్యాంకింగ్‌ రౌండ్లో 260.7 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన దివ్యాంశ్‌..ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శించాడు. ర్యాంకింగ్‌ రౌండ్‌లో మూడో స్థానం సాధించిన మరో భారత షూటర్‌ శ్రీకార్తీక్‌(258.8) కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 25 Nov 2022 06:36PM

Photo Stories