World Athletics: అథ్లెటిక్స్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికైన మాజీ క్రీడాకారిణి?
ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ప్రకటించిన వార్షిక అవార్డుల్లో భారత మాజీ క్రీడాకారిణి, లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జ్‌కు సముచిత గౌరవం లభించింది. ‘వరల్డ్ అథ్లెటిక్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్–2021’గా అంజు ఎంపికైంది. దేశంలో ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దడంలో చేస్తున్న కృషికిగాను అంజూకు ఈ అవార్డు దక్కింది. ప్రస్తుతం కోచ్‌గా పని చేస్తున్న అంజూ క్రీడల్లో లింగసమానత్వం కోసం కూడా కృషి చేస్తోందని జ్యూరీ కొనియాడింది.
ఏకైక భారత క్రీడాకారిణిగా..
కేరళలోని కొట్టాయం జిల్లాలోని చంగనస్సేరిలో 1977, ఏప్రిల్ 19న అంజూ.. 2003 పారిస్‌లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్స్‌లో స్వర్ణ పతకం సాధించింది. దీంతో పపంచ చాంపియన్‌షిప్ చరిత్రలో పతకం సాధించిన ఏకైక భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. 2005 మొనాకోలో జరిగిన ఐఏఏఎఫ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్‌లోనూ బంగారు పతకం సాధించిన అంజూ.. 2016లో యువ క్రీడాకారిణులను ప్రోత్సహించేందుకు అకాడమీని ప్రారంభించారు.
చదవండి: ప్రొ కబడ్డీ లీగ్ ఎనిమిదో సీజన్ ఎక్కడ జరగనుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య ప్రకటించిన వరల్డ్ అథ్లెటిక్స్ ఉమన్ ఆఫ్ ద ఇయర్–2021 ఎంపికైన క్రీడాకారిణి?
ఎప్పుడు : డిసెంబర్ 2
ఎవరు : భారత మాజీ క్రీడాకారిణి, లాంగ్‌జంపర్ అంజూ బాబీ జార్జ్
ఎందుకు : దేశంలో ప్రతిభను గుర్తించి తీర్చిదిద్దడంలో చేస్తున్న కృషికిగాను..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్