Aditya Mittal: భారత చెస్ 77వ గ్రాండ్‌మాస్టర్‌గా ఆదిత్య
Sakshi Education
ముంబైకి చెందిన 16 ఏళ్ల ఆదిత్య మిట్టల్ భారత చెస్‌లో 77వ గ్రాండ్‌మాస్టర్ (జీఎం)గా అవతరించాడు.
![](/sites/default/files/images/2022/12/07/aditya-mittal-1670405925.jpg)
స్పెయిన్‌లో జరుగుతున్న ఎలోబ్రెగట్ టోర్నీలో ఆరో రౌండ్‌లో ఫ్రాన్సిస్కో (స్పెయిన్)పై ఆదిత్య గెలిచి జీఎం నార్మ్ ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్‌ను అందుకున్నాడు. జీఎం కావాలంటే ఓ చెస్ ప్లేయర్ మూడు జీఎం నార్మ్‌లతోపాటు 2500 ఎలో రేటింగ్ పాయింట్లను సాధించాలి. ఆదిత్య 2021లో తొలి జీఎం నార్మ్, 2022లో మిగతా రెండు జీఎం నార్మ్‌లు సంపాదించాడు.
Tata Steel India 2022 Rapid Tourney: రన్నరప్ అర్జున్.. హారికకు మూడో స్థానం
Published date : 07 Dec 2022 03:08PM