Hanmakonda: రాష్ట్రంలోని ఏ పట్టణంలో జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ జరుగుతోంది?
60వ జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2021 సెప్టెంబర్ 15న మొదలైంది. తెలంగాణ రాష్ట్రం హన్మకొండ జిల్లా వరంగల్ సమీపంలోని హన్మకొండ పట్టణంలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నూతన సింథటిక్ ట్రాక్‌పై 5 రోజులు ఈ పోటీలు జరుగుతాయి. ఈ పోటీల్లో 573 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ లాంఛనంగా పోటీలను ప్రారంభించారు.
100 మీటర్ల చాంప్ నరేశ్...
చాంపియన్‌షిప్‌లో భాగంగా సెప్టెంబర్ 16న నిర్వహించిన పురుషుల 100 మీటర్ల పరుగు పోటీలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లాకు చెందిన అథ్లెట్ కె. నరేశ్ కుమార్ విజేతగా అవతరించాడు. నరేశ్ 100 మీటర్లను 10.30 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని సంపాదించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఈ క్రమంలో 2001లో 10.37 సెకన్లతో అనిల్ కుమార్ నెలకొల్పిన మీట్ రికార్డును సవరించాడు.
19 ఏళ్ల రికార్డు బద్దలు...
మహిళల 1500 మీటర్ల లో పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల హర్మిలన్ కౌర్ బైన్స్ 19 ఏళ్ల జాతీయ రికార్డును బద్దలు కొట్టి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. హర్మిలన్ 4ని:05.39 సెకన్లలో గమ్యానికి చేరి విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2002 ఆసియా క్రీడల్లో 4ని:06.03 సెకన్లతో సునీతా రాణి నెలకొల్పిన రికార్డును హర్మిలన్ తిరగరాసింది.
చదవండి: డీఎస్పీగా నియమితులైన వివేక్ సాగర్ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్–2021 ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 15
ఎవరు : తెలంగాణ రాష్ట్ర క్రీడలు, యువజన సంక్షేమ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్
ఎక్కడ : హన్మకొండ పట్టణం, వరంగల్ సమీపం, హనుమకొండ జిల్లా