World Health Organization: ఎక్స్‌ఈ రీకాంబినెంట్ వేరియంట్‌ను ఎక్కడ గుర్తించారు?
కోవిడ్ కొత్త ఒమిక్రాన్ వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) వెల్లడించింది. 2022, జనవరి 19న తొలుత యూకేలో గుర్తించిన ఈ కొత్త వేరియంట్‌కు ‘ఎక్స్‌ఈ రీకాంబినెంట్(బీఏ.1–బీఏ.2)’ అని పేరుపెట్టారు. ఇప్పటిదాకా వచ్చిన వేరియంట్ల కంటే ఎక్స్‌ఈ రీకాంబినెంట్ వ్యాప్తి అధికంగా ఉందని ఏప్రిల్ 2న డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటించింది. ఒమిక్రాన్ వేరియంట్‌లో సబ్ వేరియంట్ (బీఏ.2) కంటే 10 శాతం ఎక్కువగా వ్యాపిస్తోందని పేర్కొంది. కరోనా నిర్ధారణ పరీక్షలు తగ్గించడం సరైంది కాదని తెలిపింది.
Human Genome Sequence: మనిషిలో సుమారు ఎన్ని వేల జీన్స్ ఉంటాయి?
122 ఏళ్లలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు
భారతదేశంలో 2022, మార్చిలో 122 ఏళ్ల తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ ఏప్రిల్ 2న తెలిపింది. మార్చి నెలలో దేశంలోని చాలా భాగంలో తీవ్ర వేడిగాలులు వీచాయని పేర్కొంది. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చురుకైన పశ్చిమ పవనాలు లేకపోవడం, అల్ప వర్షపాతమే ఇందుకు కారణమని విశ్లేషించింది. ‘దేశం మొత్తమ్మీద చూస్తే, 33.10 డిగ్రీల సరాసరి గరిష్ట ఉష్ణోగ్రత మార్చి 2022లో నమోదైంది. గత 122 ఏళ్లలో ఇదే అత్యధికం’ అని ఐఎండీ పేర్కొంది. దేశంలో 2010 మార్చిలో 33.09 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతగా నమోదైంది.
AGU Journal: ఎర్త్ కోర్ నుంచి ఏ వాయువు లీకవుతున్నట్లు కనుగొన్నారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్