Skip to main content

Spirit of Innovation: అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్‌ విమానాన్ని రూపొందించిన సంస్థ?

Spirit of Innovation

ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్‌ విమానాన్ని రోల్స్‌రాయ్స్‌ సంస్థ రూపొందించింది. ఈ సంస్థ తయారు చేసిన ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌’ ఆల్‌–ఎలక్ట్రిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ వేగంలో మూడు కొత్త ప్రపంచ రికార్డులను సృష్టించింది. యూకే రక్షణ మంత్రిత్వ శాఖకి చెందిన బోస్కోంబ్‌ డౌన్‌ టెస్టింగ్‌ సైట్‌లో దీనిని పరీక్షించారు. టెస్ట్‌ ఫ్లైట్‌ను రోల్స్‌రాయ్స్‌ కంపెనీ... ఫ్లైట్‌ ఆపరేషన్‌ డైరెక్టర్‌ ఫిల్‌ ఓడెల్‌ నడిపారు. డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ బిజినెస్, ఎనర్జీ అండ్‌ ఇండస్ట్రియల్‌ స్ట్రాటజీ మరియు ఇన్నోవేట్‌ యూకే భాగస్వామ్యంతో రూపొందించిన ఈ ప్రాజెక్టుకు సగం నిధులను బ్రిటిష్‌ ఏరోస్పేస్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌ అందించింది. ‘రోడ్డు, సముద్ర, ఆకాశయాన మార్గాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ను రూపొందించినట్లు రోల్స్‌రాయ్స్‌ సీఈఓ వారెన్‌ ఈస్ట్‌ తెలిపారు.

స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ - ప్రత్యేకతలు

  • ఇది పూర్తిస్థాయి ఎలక్ట్రిక్‌ విమానం. 
  • గంటకు 387.4 మైళ్ల (గంటకు 623 కి.మీ) వేగంతో దూసుకెళ్తుంది. ఈ వేగం పాత రికార్డుకంటే... 132 మైళ్లు (212.5 కిలోమీటర్లు) ఎక్కువ.
  • 60 సెకన్లలోనే మూడు వేల మీటర్ల ఎత్తు ఎగరడం ఈ విమానం ప్రత్యేకత.   
  • 400 కిలోవాట్ల పవర్‌ బ్యాటరీ దీని సొంతం. దీని సామర్థ్యం 7,500 స్మార్ట్‌ఫోన్లు పూర్తిగా చార్జ్‌ చేసేంత.  

రికార్డులు..
గతంలో విమానం 3 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 345 మైళ్లు (555.9 కిలోమీటర్ల), 15 కిలోమీటర్ల ఎత్తులో గంటకు 331 మైళ్లు (531.1 కిలోమీటర్లు), 202 సెకన్లలో మూడువేలమీటర్ల ఎత్తుకు ఎగిరిన రికార్డులున్నాయి. ఈ మూడు రికార్డులను ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌’బ్రేక్‌ చేసింది.

చ‌ద‌వండి: ఏ దేశ శాస్త్రవేత్తలు ఎంఆర్‌పీ ఎమిటర్స్‌ నక్షత్రాలను కనుగొన్నారు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్‌ విమానం ‘స్పిరిట్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌’ను రూపొందించిన సంస్థ
ఎప్పుడు : నవంబర్‌ 22
ఎవరు    :  రోల్స్‌రాయ్స్‌ సంస్థ
ఎక్కడ     : యునైటెడ్  కింగ్‌డమ్‌
ఎందుకు : రోడ్డు, సముద్ర, ఆకాశయాన మార్గాల్లో కర్బన ఉద్గారాలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా…

డౌన్‌లోడ్‌ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 23 Nov 2021 03:46PM

Photo Stories