Speedtest Global Index: స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో భారత్‌కు 47వ స్థానం
స్పీడ్ టెస్ట్ గ్లోబల్ సూచీలో ఇండియా ప్రస్తుతం 47వ స్థానం పొందినట్లు ఊక్లా (Ookla) నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇండోనేషియా, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ వంటి పొరుగు దేశాలకంటే భారత్ ఈ జాబితాలో ముందు వరుసలో నిలిచింది. కొన్ని G20 దేశాలైన మెక్సికో (90వ స్థానం), టర్కీ (68వ), యూకే (62వ), జపాన్ (58వ), బ్రెజిల్ ( 50వ స్థానం), దక్షిణాఫ్రికా (48వ స్థానం) కూడా ఇండియా కంటే వెనుకబడి ఉన్నట్లు ఊక్లా ఎంటర్‌ప్రైజ్ ప్రిన్సిపల్ ఇండస్ట్రీ అనలిస్ట్ సిల్వియా కెచిచే తెలిపారు.
Giant Magellan Telescope: విశ్వాంతరాల్లోని జీవులను కనిపెట్టే అతి పెద్ద ఆప్టికల్ టెలీస్కోప్ ఇదే
5జీ సర్వీస్ ప్రారంభమైన తరువాత దేశంలో ఇంటర్నెట్ వేగం దాదాపు 3.59 రేట్లు పెరిగింది. సెప్టెంబర్ 2022లో డౌన్‌లోడ్ స్పీడ్ 13.87 Mbpsగా ఉండేది. కాగా 2023 ఆగష్టులో డౌన్‌లోడ్ స్పీడ్ 50.21 Mbpsకి చేరింది. ఈ కారణంగానే గ్లోబల్ ర్యాంకింగ్‌లో 119 స్థానాల నుంచి 47వ స్థానానికి చేరింది.
ఇప్పటికే చాలా సర్వీసులు 4జీ నుంచి 5జీకి అప్డేట్ అవుతున్నాయి. 2003లో మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన చివరి రాష్ట్రాలలో జమ్మూ & కాశ్మీర్ ఒకటి. ఇక్కడ భద్రతా సమస్యలు, ఇంటర్నెట్ షట్‌డౌన్‌ల కారణంగా.. మొబైల్ నెట్‌వర్క్ సేవల్లో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడేవి. నేడు అక్కడ కూడా పరిస్థితి ఓ కొలిక్కి వచ్చింది.
ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచడానికి.. ఎయిర్‌టెల్ 'Airtel Xstream AirFiber'ని ఢిల్లీ, ముంబైలలో ఆగస్ట్ 2023లో ప్రారంభించింది. కాగా ఇప్పుడు జియో ఇటీవల ఎయిర్ ఫైబర్ ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సర్వీస్ అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్‌కతా, ముంబై, పూణే ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో ఈ సర్వీస్ మరిన్ని నగరాలకు విస్తరించే అవకాశం ఉంది.