SpaceX Starship: ప్రపంచంలోనే భారీ రాకెట్ ‘స్టార్ షిప్’ ప్రయోగం విఫలం
Sakshi Education
ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్ ప్రయోగం విఫలమైంది. మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ రూపొందించిన అతిపెద్ద రాకెట్ నింగిలోకి ఎగిసిన కాసేపటికే పేలిపోయింది.
చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత యాత్రల కోసం స్పేస్‌ఎక్స్ సంస్థ అభివృద్ధి చేసిన ప్రపంచంలోనే అతి భారీ రాకెట్ ‘స్టార్‌షిప్’. ప్రయోగాత్మకంగా చేపట్టిన తొలి పరీక్షలో పేలిపోయింది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న బొకచికా ల్యాంచ్‌ప్యాడ్ నుంచి ప్రయోగించిన కొద్ది నిమిషాల్లోనే ప్రధాన బూస్టర్‌లో లోపంతో 40 కిలోమీటర్ల ఎత్తున పేలిపోయింది.
☛ ‘స్టార్‌షిప్’ ప్రధాన రాకెట్, బూస్టర్లు కలిపి ఎత్తు 120 మీటర్లు (సుమారు 40 అంతస్తుల భవనం ఎత్తు).
☛ ఇంధనంతో కలిపి రాకెట్ మొత్తం బరువు 5 వేల టన్నులు.. అంతరిక్షంలోకి ఏకంగా 100 టన్నుల బరువైన పేలోడ్‌ను తీసుకెళ్లగలిగే సామర్థ్యం ఉంది.
☛ స్టార్‌షిప్ ప్రయోగాల కోసం చేస్తున్న ఖర్చు సుమారు రూ.80 వేల కోట్లు.
Christina Koch: చంద్రుడిపైకి వెళ్లనున్న తొలి మహిళ క్రిస్టినా కోచ్..
Published date : 21 Apr 2023 11:46AM