Indian Institute of Geomagnetism: అంగారకుడిపై ‘సాలిటరీ తరంగాలు’
Sakshi Education
అంగారక గ్రహ వాతావరణంలో ‘సాలిటరీ తరంగాల’ ఉనికిపై తొలిసారిగా శాస్త్రవేత్తలు ఆధారాలు సేకరించారు. ముంబయిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియోమ్యాగ్నెటిజం(ఐఐజీఎం)కు చెందిన శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు.
అంగారకుడి అయస్కాంత వలయం(మ్యాగ్నెటోస్పియర్)లోని విద్యుత్ క్షేత్రంలో చోటుచేసుకునే హెచ్చుతగ్గులను సాలిటరీ తరంగాలుగా పిలుస్తారు. వీటి ఉనికికి సంబంధించిన ఆధారాలు ఇప్పటివరకూ వెలుగు చూడలేదు. భారతీ కాకడ్ నేతృత్వంలోని ఐఐజీఎం శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు సాగించారు. అంతరిక్ష సంస్థకు చెందిన ’మావెన్’ వ్యోమనౌక అందించిన డేటాను విశ్లేషించి.. 450 సాలిటరీ తరంగాల ఉనికిని గుర్తించారు. వాతావరణంలోని ప్లాస్మా దశ, ఇతర ప్రాథమిక భౌతిక శాస్త్ర ప్రక్రియల గురించి అవగాహన చేసుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి.
Published date : 23 Jan 2023 04:12PM