Norovirus: దేశంలోని ఏ రాష్ట్రంలో నోరోవైరస్ వెలుగులోకి వచ్చింది?
కోవిడ్–19 ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోకముందే దక్షిణ భారత రాష్ట్రం కేరళలో నోరోవైరస్ వెలుగులోకి వచ్చింది. వయనాడ్ జిల్లాలో నోరోవైరస్ కేసులు నిర్ధారణయ్యాయి. ఈ వైరస్ సోకిన వారు వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. అత్యంత తీవ్రంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌పై అప్రమత్తంగా ఉండాలని నవంబర్ 12న కేరళ ప్రభుత్వం హెచ్చరించింది. అత్యంత అరుదుగా వచ్చే నోరోవైరస్ ఇన్‌ఫెక్షన్‌తో వయనాడ్ జిల్లాలోని వెటర్నరీ కాలేజీ విద్యార్థుల్లో కనిపించింది. మొత్తం 13 మందికి ఈ వైరస్ సోకింది.
కోవాగ్జిన్ సామర్థ్యం 77.8 శాతం..
భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసిన కోవాగ్జిన్ కోవిడ్ టీకా అత్యంత సమర్థంగా పని చేస్తోందని, పూర్తిగా సురక్షితమైనదని లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. రెండు డోసులు తీసుకున్న వారిలో ఈ వ్యాక్సిన్ 77.8 శాతం సామర్థ్యంతో పని చేస్తోందని తెలిపింది. ఈ వ్యాక్సిన్ మూడో దశ ప్రయోగాలను లాన్సెట్ వైద్య నిపుణులు విశ్లేషించి నివేదిక రూపొందించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ఇటీవల అనుమతులిచ్చింది.
చదవండి: రోదసిలోకి వెళ్లిన 600వ యాత్రికుడు ఎవరు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : దేశంలోని ఏ రాష్ట్రంలో నోరోవైరస్ వెలుగులోకి వచ్చింది?
ఎప్పుడు : నవంబర్ 12
ఎవరు : కేరళ
ఎక్కడ : వయనాడ్ జిల్లా, కేరళ
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్