Skip to main content

Covid Origins: క‌రోనా వైర‌స్ గబ్బిలాల నుంచి కాదు.. శునకాల నుంచి వచ్చిందట‌..!

కరోనా వైరస్‌ పుట్టుకపై ఇది మరో కొత్త విశ్లేషణ. ఇన్నాళ్లూ గబ్బిలాల నుంచి ఈ వైరస్‌ సంక్రమించిందని భావిస్తూ ఉంటే కొందరు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం శునకాల నుంచి వచ్చిందని తమ పరిశోధనల్లో వెల్లడైనట్టు చెప్పారు.
COVID-19 origins

చైనాలోని వూహాన్‌ సీఫుడ్‌ మార్కెట్‌లో సేకరించిన జన్యు నమూనాలను అధ్యయనం చేస్తే వూహాన్‌ మార్కెట్‌లో అమ్ముతున్న రకూన్‌ డాగ్స్‌ నుంచే వైరస్‌ వ్యాప్తి చెందిందని తేల్చారు. ఈ కొత్త విశ్లేషణను న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక ప్రచురించింది. జనవరి 2020లో కొందరు శాస్త్రవేత్తలు వూహాన్‌ మార్కెట్‌లో శాంపిల్స్‌ సేకరించారు. అప్పటికే కొత్త వైరస్‌ ఆందోళనతో వూహాన్‌ మార్కెట్‌ అంతా ఖాళీ చేయించారు. ఆ మార్కెట్‌ గోడలపైన, నేలపైన, జంతువుల్ని ఉంచే పంజరాల్లోనూ జన్యు నమూనాలు సేకరించి అధ్యయనం చేశారు. ఆ నమూనాల్లో అత్యధిక భాగం రకూన్‌ డాగ్స్‌తో సరిపోలాయని శాస్త్రవేత్తల బృందం తేల్చింది. 

H3N2 Virus: దేశంలో వేగంగా వ్యాపిస్తోన్న H3N2 వైరస్..

ఈ వివరాలను చైనా శాస్త్రవేత్తలతోనూ వారు పంచుకున్నారు. అయితే ఆ తర్వాత గ్లోబల్‌ ఇనీషియేటివ్‌ ఆన్‌ షేరింగ్‌ ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా డేటా (జీఐఎస్‌ఏఐడీ) నుంచి ఈ డేటా మాయం అయిపోయిందని ఆ శాస్త్రవేత్తలు చెప్పారు. అరిజోనా యూనివర్సిటీ, కాలిఫోర్నియాలో స్క్రిప్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్, సిడ్నీ యూనివర్సిటీ వైరాలజిస్టులు ఈ బృందంలో ఉన్నారు. రకూన్‌ డాగ్స్‌ నుంచే మనుషులకి సంక్రమించిందా లేదా అన్నది శాస్త్రవేత్తలు స్పష్టంగా చెప్పలేకపోయారు. శునకాల నుంచి మనుషులకే నేరుగా సోకొచ్చు లేదా ఆ డాగ్స్‌ నుంచి వేరే జంతువుకి వెళ్లి మనుషులకి సోకి ఉండొచ్చని అన్నారు.

Tedros Adhanom: కరోనా మూలాల్ని తేల్చాలి.. డబ్ల్యూహెచ్‌ఓ

 

Published date : 18 Mar 2023 11:55AM

Photo Stories