Skip to main content

Tedros Adhanom: కరోనా మూలాల్ని తేల్చాలి.. డబ్ల్యూహెచ్‌ఓ

కరోనా మూలాలను కనుగొనడం నైతికావసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అభిప్రాయపడింది.
Tedros Adhanom Ghebreyesus

అప్పుడు మున్ముందు ఇతర వైరస్‌లు వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయగలమని తెలిపింది. కోవిడ్‌–19ని మహమ్మారిగా ప్రకటించి మూడేళ్లు అవుతున్న సందర్భంగా డబ్ల్యూహెచ్‌ఒ చీఫ్‌ టెడ్రోస్‌ అధ్నామ్‌ ఘెబ్రెయాసెస్‌ మాట్లాడారు. కరోనాతో లక్షలాది మంది మరణించారని, కొన్ని కోట్ల మంది లాంగ్‌ కోవిడ్‌తో ఇబ్బందులు పడుతున్నారని అందుకే ఈ వైరస్‌ పుట్టుపూర్వోత్తరాలను కనుగొనాల్సిన నైతిక బాధ్యత ఉందని అన్నారు. కరోనా తొలి కేసు వెలుగులోకి వచ్చిన చైనాలోని వూహాన్‌లో డబ్ల్యూహెచ్‌ఓ ఆధ్వర్యంలోని ప్రతినిధి బృందం 2021లోనే కొన్ని వారాలు గడిపి గబ్బిలాల నుంచి మనుషులకి ఈ వైరస్‌ సోకిందని నివేదిక సమర్పించింది.

Zombie Drug: జాంబీ డ్రగ్‌.. మనుషులను పిశాచులుగా మార్చేస్తుంది!


మరోవైపు అమెరికా అధ్యయనంలో ఈ వైరస్‌ వూహాన్‌ ల్యాబ్‌ నుంచి లీక్‌ అయిందని తేలింది. ఇలా రెండు పరస్పర విరుద్ధమైన వాదనలు ప్రచారంలో ఉండడం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొంది.అందుకే అసలు వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని టెడ్రోస్‌ చెప్పారు. అత్యంత ప్రమాదకర వైరస్‌లపై అధ్యయనానికి డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసిన సైంటిఫిక్‌ అడ్వయిజరీ గ్రూప్‌ కూడా ఇప్పటివరకు కరోనా వైరస్‌ పుట్టుకపై ఎలాంటి నిర్ధారణకు రాలేకపోయింది. కీలకమైన డేటా కనిపించడం లేదని కమిటీ అంటోంది.

India-Pakistan: ఇకపై కవ్వింపులకు దిగితే.. పాక్‌తో సమరమే!?

Published date : 13 Mar 2023 05:22PM

Photo Stories