Skip to main content

Agni 5G Phone: 5జీ ఫోన్లు అందిస్తున్న తొలి భారతీయ బ్రాండ్‌?

Agni 5G Phone

దేశీ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్‌ కొత్తగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. తద్వారా 5జీ ఫోన్లు అందిస్తున్న తొలి భారతీయ బ్రాండ్‌గా నిలిచినట్లు కంపెనీ తెలిపింది. ‘‘అగ్ని’’ బ్రాండ్‌ పేరిట నవంబర్‌ 9న ఆవిష్కరించిన ఈ ఫోన్‌ ధర రూ. 19,999గా ఉంటుంది. నవంబర్‌ 18 నుంచి ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి రానుందని కంపెనీ ప్రెసిడెంట్‌ సునీల్‌ రైనా తెలిపారు. ఈ ఫోన్‌ను దేశీయంగానే అభివృద్ధి చేశామని, ఉత్తర్‌ ప్రదేశ్‌లో నోయిడాలోని తమ ప్లాంటులో తయారు చేస్తున్నామని వివరించారు.

2022 డిసెంబర్‌ లోగా..

ఇంటర్నెట్‌ ప్రోటోకాల్‌ అడ్రెస్‌ ఐపీవీ6 ప్రమాణాలకు పూర్తిగా మారే దిశగా, 2022 డిసెంబర్‌ లోగా కస్టమర్ల దగ్గరున్న రూటర్లు, మోడెమ్‌లను, తమ నెట్‌వర్క్‌ను సరిచేసుకోవాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ (ఐఎస్‌పీ)కు కేంద్ర టెలికం శాఖ నిర్దేశించింది. ఇందుకు సంబంధించి నవంబర్‌ 2న అధికారికంగా నోట్‌ జారీ చేసింది. 20222 డిసెంబర్‌ 31 తర్వాత ఐఎస్‌పీలు కొత్తగా అందించే రిటైల్‌ వైర్‌లైన్‌ కనెక్షన్లు అన్నీ కూడా ఐపీవీ6కి అనుగుణంగా ఉండాలని సూచించింది.
 

చ‌ద‌వండి: కోవిడ్‌ సంబంధ మాత్రకు ఆమోదం తెలిపిన తొలి దేశం?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : 5జీ ఫోన్లు అందిస్తున్న తొలి భారతీయ బ్రాండ్‌?
ఎప్పుడు : నవంబర్‌ 9
ఎవరు    : దేశీ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్‌ 
ఎక్కడ    : భారత్‌
ఎందుకు : ‘అగ్ని’ బ్రాండ్‌  పేరుతో కొత్తగా 5జీ స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించినందున...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 10 Nov 2021 04:13PM

Photo Stories