Corona Virsus: కోవిడ్ సంబంధ మాత్రకు ఆమోదం తెలిపిన తొలి దేశం?
కరోనా కట్టడి కోసం యాంటీవైరల్ మాత్రలు మార్కెట్‌లోకి రాబోతున్నాయి. బ్రిటన్, అమెరికాలు ఈ దిశగా ముందడుగు వేశాయి. ఫ్లూ జ్వరం చికిత్సలో వాడే యాంటీ వైరల్ లాగెవ్రియో (మోల్నూపిరావిర్)ని కోవిడ్ చికిత్సకి అనుమతినిస్తూ బ్రిటన్‌కు చెందిన ది మెడిసన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) నవంబర్ 4న అనుమతులు మంజూరు చేసింది. దీంతో ప్రపంచంలోనే కరోనా చికిత్స కోసం యాంటీ వైరల్ మాత్రకి ఆమోద ముద్ర వేసిన తొలి దేశంగా యూకే నిలిచింది. రిడ్జ్‌బ్యాక్ బయోథెరపిటిక్స్, మెర్క్ షార్ప్ అండ్ ధోమె (ఎంఎస్‌డీ) కంపెనీలు సంయుక్తంగా మోల్నూపిరావిర్ మాత్రను రూపొందించాయి.
త్వరలో మార్కెట్లోకి ఫైజర్ మాత్ర..
అమెరికా ఫార్మసీ దిగ్గజం ఫైజర్ కంపెనీ తయారు చేసిన మాత్ర 90 శాతం కరోనా మరణాలను నివారిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది. ఇప్పటివరకు అమెరికాలో కరోనా సోకిన వారికి ఆస్పత్రుల్లో చేర్పించి ఇంజెక్షన్లు ఇస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇంట్లోనే అత్యంత సులభంగా వాడే మాత్రను తయారు చేసినట్టుగా ఫైజర్ కంపెనీ చీఫ్ సైంటిఫిక్ ఆఫీసర్ డాక్టర్ మైకేల్ డోల్‌స్టెన్ నవంబర్ 5న వెల్లడించారు. ప్రస్తుతం ఈ మాత్ర అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) పరిశీలనలో ఉందని చెప్పారు.
చదవండి: డబ్ల్యూహెచ్‌ఓ అనుమతి పొందిన తొలి భారతీయ కోవిడ్ టీకా?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోవిడ్ సంబంధ మాత్రకు ఆమోదం తెలిపిన తొలి దేశం?
ఎప్పుడు : నవంబర్ 4
ఎవరు : యునైటెడ్ కింగ్‌డ్
ఎందుకు : ఫ్లూ జ్వరం చికిత్సలో వాడే యాంటీ వైరల్ లాగెవ్రియో (మోల్నూపిరావిర్)ని కోవిడ్ చికిత్సకి అనుమతించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్