చైనాలో మరో కొత్త వైరస్ Langya
చైనాలోని తూర్పు ప్రావిన్స్‌లో ఇప్పటివరకు 35 మందికి ఈ వైరస్ సోకి అనారోగ్యం బారినపడడం ఆందోళన పుట్టిస్తోంది. జంతువుల నుంచి మనుషులకి సంక్రమించే ఈ వైరస్‌ని లాంగ్యా హెనిపావైరస్ ( Lay– V) అని పిలుస్తున్నారు. ఈ వైరస్‌కి చికిత్స, వ్యాక్సిన్ అందుబాటులో లేవు. లక్షణాల ఆధారంగా మందులు ఇస్తున్నారు. తూర్పు చైనాలోని షాన్‌డాంగ్, హెనాన్ ప్రావిన్స్‌లో జంతువులతో అధికంగా సావాసం చేసే రైతుల్లో కొందరికి జ్వరం సోకడంతో స్వాబ్ పరీక్షలు నిర్వహించగా ఈ వైరస్ సోకినట్టు వెల్లడైంది.
Also read: Most Distant Star ఎరెండల్
నిఫా, హెండ్రా వంటి ప్రాణాంతక వైరస్‌ల కుటుంబానికి చెందినదే ఈ వైరస్ అని వివిధ అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఈ వైరస్‌ని బయోసేఫ్టీ లెవల్ 4 (బీఎస్‌ఎల్’)గా గుర్తించారు. ఈ వైరస్ సోకితే 40–75% వరకు మరణాలు సంభవిస్తాయి. ఈ వైరస్‌ని 2018లో గుర్తించారు. ఇంట్లో పెంచుకునే మేకల్లో 2 శాతం, కుక్కల్లో 5 శాతం జీవులు ఇప్పటికే ఈ వైరస్ బారినపడ్డాయి. మనుషుల్లో ఈ కేసులు ఇప్పుడే వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఇది మనుషుల నుంచి మనుషులకి వ్యాపిస్తుందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కావాల్సి ఉంది.
Also read: Monkey Pox : త్వరలో టీకా
లక్షణాలు ఇవీ..
జ్వరం, దగ్గు, అలసట, వికారం, తలనొప్పి, వాంతులు, ఆకలి మందగించడం వంటి లక్షణాలే కనిపిస్తున్నాయి. ఈ వైరస్ సోకిన వారిలో 35శాతం మందికి ప్లేట్‌లెట్ కౌంట్ పడిపోవడం, 54% మందిలో/ రోగనిరోధక శక్తికి మూలమైన వైట్ బ్లడ్ కౌంట్ (డబ్ల్యూబీసీ)లో తగ్గిపోవడం, కాలేయానికి సంబంధించిన సమస్యలు 35% మంది, కిడ్నీకి సంబంధించిన సమస్యలు 8% మందిలో వచ్చినట్టుగా గుర్తించినట్టు ది న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసన్ ప్రచురించింది.
Also read: E-bandage: గాయాలను మాన్పే ఈ–బ్యాండేజ్‌ల అభివృద్ధి
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP