ISRO astronaut's Moon Mission: చందమామపై తరువాయి అడుగు భారతీయ వ్యోమగాములదేనా..!
భవిష్యత్తుపై దృష్టితో, ‘గగన్ యాన్’ ప్రోగ్రామ్‌లో భాగంగా, ఇద్దరి నుంచి ముగ్గురు వరకూ భారతీయ వ్యోమగాములను ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్‌ఈఓ) లోకి పంపించి, మూడు రోజుల వరకు అక్కడ ఉంచి, మన దేశంలోని ఒక నీటి వనరుపై వారిని ల్యాండ్ చేసే (దించే) కార్యక్రమంలో మరొక అడుగు ముందుకు వేయాలని ప్రయత్నిస్తోంది ఇస్రో.
Astronaut to the moon by 2040: 2040 కల్లా చంద్రుడిపై వ్యోమగామి అడుగుపెట్టేలా ప్రణాళికలు
ఈ మిషన్ కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురు టెస్ట్ పైలట్‌లను ఆస్ట్రోనాట్– డెసిగ్నేట్‌లుగా ఎంపిక చేశాం. ప్రస్తుతం, వారు బెంగ ళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ (ఏటీఎఫ్)లో మిషన్–నిర్దిష్ట శిక్షణ పొందుతున్నారు. హ్యూమన్– రేటెడ్ (మానవులను సురక్షితంగా రవాణా చేయగల సామర్థ్యం) లాంచ్ వెహికల్ (హెచ్‌ఎల్‌వీఎమ్3), క్రూ మాడ్యూల్ (సీఎమ్), సర్వీస్ మాడ్యూల్ (ఎస్‌ఎమ్) లతో కూడిన ఆర్బిటల్ మాడ్యూల్; లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లతో సహా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో ప్రారంభ దశలో ఉంటుంది. ఇంటి గ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ ఫ్లైట్‌లతో పాటు రెండు ఒకేలా ఉండే అన్– క్రూడ్ మిషన్‌లు (జీ1, జీ2) మనుషులతో కూడిన మిషన్‌కు ముందు ఉంటాయి.
సీఎమ్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. సీఎమ్ అనేది సిబ్బంది కోసం అంతరిక్షంలో భూమి–వంటి వాతా వరణంతో నివాసయోగ్యంగా ఉండే స్థలం. వ్యోమగా ములు సురక్షితంగా తిరిగి రావడం కోసం ఉద్దేశించింది ఇది. భద్రతా చర్యలలో అత్యవసర పరిస్థితుల కోసం క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) కూడా ఉంటుంది.టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) యొక్క మొదటి డెవలప్‌మెంట్ ఫ్లైట్ 2023 అక్టోబరు 21న ప్రారంభించబడింది. ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క ఫ్లైట్ అబార్ట్‌ను విజయవంతంగా పరీక్షించగలిగింది. ఆ తర్వాత క్రూ మాడ్యూల్ వేరుపడటం, బంగాళాఖా తంలో ఇండియన్ నావికదళం దానిని సురక్షితంగా రికవర్ చేయడం కూడా జరిగాయి. మానవ రహిత మిషన్‌లూ, అంతిమంగా మానవ సహిత అంతరిక్ష మిషన్ 2025లో ప్రారంభించబడుతుందనీ అంచనా వేయడానికి ఈ టెస్ట్ ఫ్లైట్ విజయం కీలకమైనది.