GSAT-12: కాలం చెల్లిన శాటిలైట్‌ను ధ్వంసం చేసిన ఇస్రో
Sakshi Education
కాలం చెల్లిన జీశాట్–12 ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనే పేల్చివేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రకటించింది.
2011 జులై 15న పీఎస్‌ఎల్‌వీ సీ17 రాకెట్ ద్వారా జీశాట్–12 ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది. సుమారు 12 ఏళ్లపాటు సేవలందించింది. ఏప్రిల్ 21తో ఈ ఉపగ్రహానికి కాలం చెల్లింది. దీంతో, అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోకుండా ధ్వంసం చేసినట్లు ఇస్రో పేర్కొంది. అంతర్జాతీయ ఒప్పందాల మేరకు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు తెలిపింది. కాలం చెల్లిన ఉపగ్రహాలను తొలగించే పరిజ్ఞానాన్ని సొంతంగా అభివృద్ధి చేసుకున్న ఇస్రో స్వయంగా ఆ ప్రక్రియను చేపడుతోంది.
SpaceX Starship: ప్రపంచంలోనే భారీ రాకెట్ ‘స్టార్ షిప్’ ప్రయోగం విఫలం
Published date : 22 Apr 2023 01:00PM