Skip to main content

ISRO 100th Mission: ఇస్రో వందో ప్రయోగం సక్సెస్

భారత అంతరి ప్రయోగ సంస్థ ఇస్రో చేపట్టిన వందో ప్రయోగం విజయవంతమైంది.
ISRO 100th Mission Successful Launch from Sriharikota   GSLV F-15 rocket launch from Sriharikota, India

సూళ్లురుపేట శ్రీహరికోట నుంచి జ‌న‌వ‌రి 29వ తేదీ తెల్ల‌వారుజామున జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌-15 రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. సుమారు 2,250 కిలోల బరువున్న ఎన్‌వీఎస్‌-02 ఉపగ్రహాన్ని అది విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.  

కొత్త రకం నేవిగేషన్‌ ఉపగ్రహాల్లో ఎన్‌వీఎస్‌-02 రెండోది. ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్‌ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2,250కిలోలు. భౌగోళిక, వైమానిక, సముద్ర నేవిగేషన్‌ సేవల కోసం ఈ ఉపగ్రహ ప్రయోగం ఉపయోగపడనుంది. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్‌ పరికరాల్లో లోకేషన్‌ ఆధారిత సేవలందించనుంది. 

పదేళ్లపాటు ఈ నేవీగేషన్‌ శాటిలైట్‌ తన సేవలందిస్తుందని ఇస్రో చైర్మన్‌ వీ నారాయణన్‌ తెలిపారు. ఇది నారాయణన్‌ నేతృత్వంలో జరిగిన తొలి ప్రయోగం ఇదే. 

ISRO: ఇస్రోకు ‘వంద’నం.. ఇస్రో చైర్మన్‌లు, షార్‌ డైరెక్టర్లు వీరే..

కాగా.. ఇస్రో శ్రీహరికోటలో రాకెట్‌ ప్రయోగ కేంద్రాన్ని స్థాపించిన తర్వాత ఇప్పటివరకు 99 ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో కేవలం పది ప్రయోగాలు మాత్రమే విఫలమయ్యాయి. ఈ వందో ప్రయోగం విజయవంతం కావడంతో.. మెరుగైన జీపీఎస్‌(GPS) తరహా నేవిగేషన్ సిస్టం అందుబాటులోకి రానుంది. భారత భూభాగంతో పాటు భారత భూభాగంలోని తీరం నుంచి దాదాపు 1,500 కిలోమీటర్ల వరకు ఈ నేవిగేషన్ సిస్టం పని చేయనుంది.

Gaganyaan Mission: గగన్‌యాన్‌–1 మిషన్‌లో పురోగతి

Published date : 29 Jan 2025 12:40PM

Photo Stories