Skip to main content

Chickpea: శనగల సంపూర్ణ జన్యుక్రమాన్ని నమోదు చేసిన సంస్థ?

Chikpea

భారత్‌తో పాటు దాదాపు 50 దేశాల్లో విరివిగా వాడే శనగల పూర్తిస్థాయి జన్యుక్రమ నమోదు పూర్తయింది. అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) నేతృత్వంలో దేశ విదేశాలకు చెందిన 41 పరిశోధన సంస్థలు కలసి నిర్వహించిన ప్రాజెక్టు ఫలితంగా సంపూర్ణ జన్యుక్రమం సిద్ధమైంది. దీంతో అధిక దిగుబడులిచ్చే, చీడపీడలు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకోగల కొత్త వంగడాల సృష్టికి మార్గం సుగమైంది. ఇక్రిశాట్‌ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉంది.

కాబూలీ చనా...

ఇక్రిశాట్‌ 2013లో ‘కాబూలీ చనా’అని పిలిచే ఒక రకం శనగల జన్యుక్రమాన్ని విజయవంతంగా నమోదు చేసింది. అయితే మరిన్ని రకాల జన్యుక్రమాలను కూడా నమోదు చేయడం ద్వారా శనగల పుట్టు పూర్వోత్తరాల గురించి పూర్తిగా తెలుసుకునేందుకు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. దాదాపు 3,366 శనగ రకాలను ఎంపిక చేసి వాటన్నింటి జన్యుక్రమాలను నమోదు చేసి, విశ్లేషణ జరిపింది. ఫలితంగా శనగల్లో దాదాపు 29,870 జన్యువులు ఉంటాయని స్పష్టం కాగా ఇందులో 1,582 జన్యువులను మొదటిసారి గుర్తించారు.

 

మధ్యధరా ప్రాంతంలో పుట్టుక..

‘సిసెర్‌ రెటిక్యులాటమ్‌’అనే అడవిజాతి మొక్క నుంచి దాదాపు 12,600 ఏళ్ల కింద శనగలు పుట్టుకొచ్చాయని ఇక్రిశాట్‌ సంపూర్ణ జన్యుక్రమ విశ్లేషణ ద్వారా తేలింది. ఫర్టైల్‌ క్రెసెంట్‌గా పిలిచే ప్రస్తుత ఇజ్రాయెల్, ఇరాక్, సిరియా ప్రాంతంలో పుట్టిన ఈ పంట కాలక్రమంలో టర్కీ మీదుగా మధ్యధరా ప్రాంతానికి, దక్షిణాసియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాలకు రెండు మార్గాల్లో విస్తరించింది.
 

చ‌ద‌వండి: 5జీ ఫోన్లు అందిస్తున్న తొలి భారతీయ బ్రాండ్‌?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : శనగల పూర్తిస్థాయి జన్యుక్రమ నమోదు పూర్తి
ఎప్పుడు : నవంబర్‌ 10
ఎవరు    : అంతర్జాతీయ మెట్ట ప్రాంత పంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్‌) నేతృత్వంలో దేశ విదేశాలకు చెందిన 41 పరిశోధన సంస్థలు
ఎందుకు : అధిక దిగుబడులిచ్చే, చీడపీడలు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా తట్టుకోగల కొత్త వంగడాల సృష్టికి...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 11 Nov 2021 05:06PM

Photo Stories