Skip to main content

Drone Warfare Programme: స్వదేశీ పరిజ్ఞానంతో సూడో శాటిలైట్‌ను రూపొందించనున్న సంస్థ?

HAL

పూర్తి స్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హై ఆల్టిట్యూడ్‌ సూడో శాటిలైట్‌ (హెచ్‌ఏపీఎస్‌)ను రూపొందించేందుకు హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) సిద్ధమవుతోంది. కంబైండ్‌ ఎయిర్‌ టీమింగ్‌ సిస్టమ్‌ (సీఏటీఎస్‌) పేరిట అన్‌మ్యాన్డ్‌ డ్రోన్‌ వార్‌ఫేర్‌ కార్యక్రమంలో భాగంగా రూపొందించే ఈ ఉపగ్రహం కోసం రూ.700కోట్లు వ్యయం చేయనున్నారు. భారత ప్రభుత్వం ఈ నిధులు విడుదల చేయనున్నట్లు సెప్టెంబర్‌ 20న హెచ్‌ఏఎల్‌ ప్రకటించింది. పూర్తిస్థాయి హెచ్‌ఏపీఎస్‌ పూర్తయ్యేందుకు కనీసం నాలుగేళ్లు పట్టనుందని వెల్లడించింది.

హెచ్‌ఏపీఎస్‌ విశేషాలు...

  • 500 కిలోల కంటే ఎక్కువ బరువుండే ఈ హెచ్‌ఏపీఎస్‌ సౌర విద్యుత్తుతో పని చేస్తుంది. 
  • దాదాపు 70వేల అడుగుల ఎత్తు ఎగరగలిగే ఈ ఉపగ్రహం నెలల తరబడి సేవలందిస్తుంది. 
  • టెలీకమ్యూనికేషన్, రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్‌ ప్రత్యేకతలతో రూపొందనున్న ఈ ఉపగ్రహం రక్షణ, పౌర సేవలకు ఉపయోగపడనుంది.
  • మానవ రహిత విమానాలు(యూఏవీ), సంప్రదాయ ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా తయారవుతున్న హెచ్‌ఏపీఎస్‌ కమ్యూనికేషన్, సర్వేలెన్స్, లైవ్‌ వీడియోలతో పాటు స్పష్టమైన చిత్రాలను తీయగలగుతుంది. 
  • ప్రకృతి వైపరీత్యాల సందర్భంగా సమర్థమైన రక్షణ కార్యక్రమాలను కూడా నిర్వహించనుంది.

చ‌ద‌వండి: ఏ పేరుతో స్పేస్‌ఎక్స్‌ సంస్థ మూడు రోజుల అంతరిక్ష యాత్రను చేపట్టింది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : కంబైండ్‌ ఎయిర్‌ టీమింగ్‌ సిస్టమ్‌ (సీఏటీఎస్‌) పేరుతో హై ఆల్టిట్యూడ్‌ సూడో శాటిలైట్‌ (హెచ్‌ఏపీఎస్‌) రూపకల్పన 
ఎప్పుడు  : సెప్టెంబర్‌ 18
ఎవరు    : హిందుస్థాన్‌ ఏరోనాటిక్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) 
ఎందుకు : అన్‌మ్యాన్డ్‌ డ్రోన్‌ వార్‌ఫేర్‌ కార్యక్రమంలో భాగంగా...
 

 

Published date : 21 Sep 2021 06:49PM

Photo Stories