European Space Agency: గురుడి గుట్టు విప్పనున్న జ్యూస్
గురు గ్రహం, దాని చుట్టూ పరిభ్రమిస్తున్న చందమామలపై పరిశోధనల కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ).. ‘జ్యూస్’ అనే వ్యోమనౌకను ప్రయోగించింది. దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానా నుంచి ఏరియాన్ రాకెట్ ద్వారా ఇది నింగిలోకి పయనమైంది. గురు గ్రహాన్ని చేరుకోవడానికి ఈ వ్యోమనౌకకు 8 ఏళ్లు పడుతుంది. అక్కడికి చేరాక ఇది ఆ గ్రహం గురించి నిశితంగా శోధిస్తుంది. గురుడి కక్ష్యలో ఉన్న యూరోపా, లిస్టో, గానీమీడ్ చందమామల పైనా పరిశోధనలు సాగించనుంది. హిమమయంగా ఉండే వీటి ఉపరితలాల కింద సముద్రాలు ఉండొచ్చని, జీవుల మనుగడకూ అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ యాత్రలో జ్యూస్.. గానీమీడ్ చుట్టూ పరిభ్రమిస్తుంది. మరో గ్రహానికి చెందిన చందమామ చుట్టూ ఒక వ్యోమనౌక తిరగడం అదే మొదటిసారి.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP