Skip to main content

Gold Lithium: బంగారం, లిథియం నిల్వలు.. ఎక్కడో తెలుసా..?

డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ టాంజానియాలో బంగారం, లిథియం నిల్వలను గుర్తించింది.
Deccan Gold Mines Subsidiary Strikes Gold Lithium In Tanzania   Gold nugget discovered in Tanzania

వివరాలు.. 

  • డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌కు చెందిన డెక్కన్‌ గోల్డ్‌ టాంజానియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ టాంజానియాలో బంగారం, లిథియం నిల్వలను గుర్తించింది.
  • ఈ నిల్వలు న్జెగా-టబోరా గ్రీన్‌స్టోన్‌ బెల్ట్‌లోని పీఎల్‌ బ్లాక్‌ 11524లో ఉన్నాయి.
  • బంగారంతోపాటు లిథియంకు చెందిన ముడిపదార్థాలు కూడా ఈ ప్రాంతంలో ఉన్నట్లు తేలింది.
  • లిథియం ఎలక్ట్రిక్ వాహనాల్లో ఉపయోగించే బ్యాటరీల తయారీకి ఎంతో ముఖ్యమైనది.
  • డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ హనుమ ప్రసాద్‌ మోదాలి ఈ లిథియం నిల్వల గుర్తింపు అంతర్జాతీయంగా విస్తరించడానికి తమకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు.
  • డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌ లిథియం, ఇతర అనుబంధ లోహాల కోసం ప్రాస్పెక్టింగ్‌ లైసెన్సు(పీఎల్‌) ఆర్డరు కోసం చూస్తున్నట్లు మోదాలి తెలిపారు.
  • టాంజానియాలో కీలక ఖనిజాల కోసం అధ్యయనాలను కొనసాగించినట్లు చెప్పారు.
  • ఇందులో భాగంగా 100.49 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో లిథియం నిల్వలు ఉన్నట్లు తేలిందన్నారు.
  • దీనికి పీఎల్‌ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వివరించారు.
  • డెక్కన్‌ గోల్డ్‌ మైన్స్‌కు ఐదు అధునాతన బంగారు గనుల ప్రాజెక్టులు ఉన్నాయి.

AI Software Engineer: ప్రపంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ‘డెవిన్‌’.. వెబ్‌సైట్‌ రెడీ!

Published date : 22 Mar 2024 03:34PM

Photo Stories