Covid Vaccine @ 200 కోట్ల డోసులు
కోవిడ్ వ్యాక్సినేషన్‌లో జూలై 17న దేశం మరో కీలక మైలురాయిని దాటింది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ కార్యక్రమంలో 18 నెలల వ్యవధిలో 200 కోట్ల డోసులు పైగా పంపిణీ చేసింది. జూలై 17న మధ్యాహ్నం ఒంటిగంట వరకు అందిన సమాచారం మేరకు మొత్తం 2,00,000,15,631 డోసులు వేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలోని వయోజనుల్లో 98% మంది కనీసం ఒక్క డోసైనా వ్యాక్సిన్ వేయించుకోగా, 90% మంది పూర్తి రెండు డోసులు వేయించుకున్నట్లు వివరించింది.
Also read: WHO: కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌కు పేరు ఎలా వచ్చింది?
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 100%
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశంలోని 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 12 ఏళ్లు పైబడిన అర్హులందరికీ కోవిడ్ రెండు డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య శాఖ పేర్కొంది. అవి అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకశీ్మర్, హిమాచల్ ప్రదేశ్, లక్షద్వీప్, చండీగఢ్, గోవా. అదేవిధంగా, అత్యధికంగా యూపీ 34,41,93,641 డోసులు, మహారాష్ట్ర 17,05,59,447, బెంగాల్ 14,40,33,794, బిహార్ 13,98,52,042, మధ్యప్రదేశ్ 12,13,15,911 డోసులు పంపిణీ చేశాయి.