Covid-19: ఒమిక్రాన్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని రూపొందించిన ఐఐటీ?
గంటన్నరలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని(రాపిడ్ స్క్రీనింగ్ పరీక్ష) ఢిల్లీలోని ఐఐటీ పరిశోధక బృందం రూపొందించింది. ఆర్‌టీపీసీఆర్ ఆధారిత నిర్ధారణ పరీక్షతో కోవిడ్ కొత్త వేరియంట్‌ను వేగంగా గుర్తించవచ్చని పరిశోధకులు తెలిపారు. ప్రస్తుతం ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు జీనోమ్ స్వీకెన్సింగ్‌ను వాడుతున్నారు. దీని ఫలితాలు వచ్చేందుకు 3 రోజులు పడతుంది. ఈ నేపథ్యంలో ఐఐటీ ఢిల్లీకి చెందిన కుసుమా స్కూల్ ఆఫ్ బయలాజికల్ సైన్సెస్... రాపిడ్ స్క్రీనింగ్ పరీక్షను అభివృద్ధి చేసింది. ఒమిక్రాన్‌లో వేరియంట్‌లో మాత్రమే కనిపించే ప్రత్యేక ఉత్పరివర్తనాలను(మ్యుటేషన్లు) గుర్తించడంపై ఆధారపడి నిర్ధారణా పరీక్షను రూపొందించారు. గతంలో కరోనాను తొందరగా, సులభంగా గుర్తించే పీసీఆర్ ఆధారిత పరీక్షను ఐఐటీ ఢిల్లీ రూపొందించింది.
వెల్త్‌బ్రీఫింగ్ పురస్కారాన్ని అందుకున్న సంస్థ?
‘అత్యుత్తమ ఈటీఎఫ్ ప్రొవైడర్’గా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ తాజాగా వెల్త్‌బ్రీఫింగ్ పురస్కారాన్ని దక్కించుకుంది. మధ్యప్రాచ్య, ఉత్తర ఆఫ్రికా దేశాలకు సంబంధించి (ఎంఈఎన్‌ఏ) యూఏఈలోని దుబాయ్‌లో జరిగిన ఎనిమిదో వార్షిక వెల్త్‌బ్రీఫింగ్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ కార్యక్రమంలో ఈ అవార్డు అందించారు. వివిధ ఆర్థిక సాధనాలకు సంబంధించిన వినూత్న స్కీములతో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ స్థిరంగా రాణిస్తోందని వెల్త్‌బ్రీఫింగ్ పబ్లిషర్ స్టీఫెన్ హ్యారిస్ పేర్కొన్నారు.
చదవండి: స్మార్ట్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించిన దేశం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : గంటన్నరలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించే కొత్త పరీక్షా విధానాన్ని(రాపిడ్ స్క్రీనింగ్ పరీక్ష) రూపొందించిన ఐఐటీ?
ఎప్పుడు : డిసెంబర్ 13
ఎవరు : ఢిల్లీలోని ఐఐటీ పరిశోధక బృందం
ఎందుకు : జీనోమ్ స్వీకెన్సింగ్‌ను ఉపయోగించి ఒమిక్రాన్‌ను గుర్తించేందుకు 3 రోజులు పడుతున్న నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్