Skip to main content

Audio And Video Calls Feature In X: త్వరలో ఎక్స్ ఆడియో, వీడియో కాల్స్

ఎలాన్ మస్క్ ట్విటర్ కంపెనీ కొనుగోలు చేసిన తరువాత అనేక మార్పులు చేసిన విషయం తెలిసిందే.
Audio And Video Calls Feature In X, Elon Musk ,announcing new features
Audio And Video Calls Feature In X

ఉద్యోగుల తొలగింపు, బ్రాండ్ లోగోలో మార్పు వంటి వాటితో పాటు, ఇటీవల ట్విటర్‌కి 'ఎక్స్' అని నామకరణం చేసాడు. కాగా ఇప్పుడు ఆడియో అండ్ వీడియో కాల్స్‌కి సంబంధించిన సంచలన వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Elon Musk New AI Firm xAI: చాట్‌జీపీటీకి గట్టి పోటీ ఇవ్వనున్న ఎలాన్‌ మస్క్‌ కొత్త కంపెనీ ‘AI’

ఇటీవల 'ఎక్స్'గా పేరు మార్చుకున్న ట్విటర్‌లో త్వరలో ఆడియో అండ్ వీడియో కాల్స్ సదుపాయం లభిస్తుందని కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. దీనిని వినియోగదారులు ఫోన్ అవసరం లేకుండా వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. ఇది ఆండ్రాయిడ్, ఐఓఎస్, మాక్, పీసీలో వినియోగించుకోవచ్చు. అయితే ఇది ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందనేది తెలియాల్సి ఉంది.

Twitter vs Meta: ట్విటర్‌కి గట్టి పోటీ.. త్వరలో కొత్త యాప్!

Published date : 31 Aug 2023 05:24PM

Photo Stories