Skip to main content

Telecom Sector: 5జీ టెస్ట్‌బెడ్‌ను ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు?

5G Technology

చిన్న, మధ్య తరహా సంస్థలు, ఇతర టెలికం రంగ సంస్థలు 5జీ టెక్నాలజీకి సంబంధించి తమ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు ఉపయోగపడే ‘టెస్ట్‌బెడ్‌’ను 2022, జనవరిలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. డిసెంబర్‌ 9న ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌–2021లో పాల్గొన్న సందర్భంగా కేంద్ర టెలికం శాఖ (డాట్‌) కార్యదర్శి కె. రాజారామన్‌ ఈ విషయం వెల్లడించారు. న్యూఢిల్లీ వేదికగా డిసెంబర్‌ 8న ప్రారంభమైన మొబైల్‌ కాంగ్రెస్‌ డిసెంబర్‌ 10న ముగియనుంది.

రూ. 224 కోట్లతో..

సుమారు రూ. 224 కోట్లతో దేశీ 5జీ టెస్ట్‌బెడ్‌ను రూపొందించే ప్రతిపాదనకు 2018 మార్చిలో కేంద్ర టెలికం శాఖ ఆమోదముద్ర వేసింది. హైదరాబాద్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లోని ఐఐటీ విద్యా సంస్థలు, సొసైటీ ఫర్‌ అప్లైడ్‌ మైక్రోవేవ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రీసెర్చ్, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఇన్‌ వైర్‌లెస్‌ టెక్నాలజీ దీని రూపకల్పనలో పాలుపంచుకుంటున్నాయి.

ప్రస్తుతం ఈ సంస్థలకే..

ప్రస్తుతం 5జీ ట్రయల్స్‌ నిర్వహించేందుకు భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్‌ జియో, వొడాఫోన్‌ ఐడియా, ఎంటీఎన్‌ఎల్‌ సంస్థలకు టెలికం శాఖ స్పెక్ట్రం కేటాయించింది. ప్రయోగాత్మక పరీక్షల నిర్వహణకు గడువును 2021, మే 26 దాకా లేదా వేలం తర్వాత వ్యాపార అవసరాల కోసం స్పెక్ట్రంను కేటాయించే దాకా పొడిగించింది.
చ‌ద‌వండి: ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ను రూపొందించిన సంస్థ?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
5జీ టెస్ట్‌బెడ్‌ను 2022, జనవరిలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది
ఎప్పుడు  : డిసెంబర్‌ 9
ఎవరు    : కేంద్ర టెలికం శాఖ (డాట్‌) కార్యదర్శి కె. రాజారామన్‌ 
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : చిన్న, మధ్య తరహా సంస్థలు, ఇతర టెలికం రంగ సంస్థలు 5జీ టెక్నాలజీకి సంబంధించి తమ సొల్యూషన్స్‌ను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 10 Dec 2021 06:37PM

Photo Stories